Earthquake: త్రిపురలో భూకంపం..ధర్మానగర్‌కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం.. రిక్టార్‌ స్కేలుపై తీవ్రత..

మరోవైపు.. మొరాకో దేశంలోని అట్లాంటికా, మధ్యధరా సముద్ర తీరంలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం భారీగా ఆస్తి, ప్రాణనష్టాన్ని మిగిల్చింది. ఈ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 2000 మంది చనిపోయారు. 750 మందికి పైగా గాయపడ్డారు. క్షత గాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మారాకేష్ నగరంలోని

Earthquake: త్రిపురలో భూకంపం..ధర్మానగర్‌కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం.. రిక్టార్‌ స్కేలుపై తీవ్రత..
Earthquake
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2023 | 9:48 AM

త్రిపురలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ధర్మానగర్‌కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. మరోవైపు ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 2వేలకు చేరింది.. మొరాకో దేశంలోని అట్లాంటికా, మధ్యధరా సముద్ర తీరంలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం భారీగా ఆస్తి, ప్రాణనష్టాన్ని మిగిల్చింది. ఈ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 2000 మంది చనిపోయారు. 750 మందికి పైగా గాయపడ్డారు. క్షత గాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మారాకేష్ నగరంలోని దక్షిణ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. భూకంపం కేంద్రం మారాకేష్ కు నైరుతి దిశలో ఉన్న హై అట్లాంటిస్ పర్వతాలు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం 18.5 కి.మీ లోతులో సంభవించింది.

శుక్రవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం పది గంటల తర్వాత భూకంపం సంభవించింది. మొదటి భూకంపం తర్వాత 4.9 తీవ్రతతో మరో భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది భవనాలు, ఇళ్లలో చిక్కుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. భూకంపం ప్రకంపనలు కాసాబ్లాంకా,ఎస్సౌయిరాలో నివేదించబడ్డాయి. భూకంపం ధాటికి చారిత్రక కట్టడాలు, అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కష్టతరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మొరాకోలో సంభవించిన భూకంపం వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను తాను పంచుకుంటున్నానని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..