6G Technology: 6జీ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకున్న భారత్, అమెరికా
ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో కూడిన జీ20 సదస్సుకు ఈసారి అధ్యక్షత వహిస్తున్న భారత్‌కు ప్రశంసలు అందుతున్నాయి. శనివారం రోజున ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సమావేశంలో.. ప్రపంచ శాంతి, సౌభగ్యమే లక్ష్యంగా పలు అంశాలతో కూడిన న్యూఢిల్లీ జీ20 సమ్మిట్ లీడర్స్ డిక్లరేషన్‌కు కూటమి సభ్యదేశాల ఆమోదం దక్కింది. ఈ డిక్లరేషన్‌పై కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని.. వెంటనే ఆమోదం పొందినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను అధిగమించి మరీ డిక్లరేషన్‌పై ఆమోద ముద్ర పడటం గమనార్హం.
ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో కూడిన జీ20 సదస్సుకు ఈసారి అధ్యక్షత వహిస్తున్న భారత్‌కు ప్రశంసలు అందుతున్నాయి. శనివారం రోజున ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సమావేశంలో.. ప్రపంచ శాంతి, సౌభగ్యమే లక్ష్యంగా పలు అంశాలతో కూడిన న్యూఢిల్లీ జీ20 సమ్మిట్ లీడర్స్ డిక్లరేషన్‌కు కూటమి సభ్యదేశాల ఆమోదం దక్కింది. ఈ డిక్లరేషన్‌పై కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని.. వెంటనే ఆమోదం పొందినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను అధిగమించి మరీ డిక్లరేషన్‌పై ఆమోద ముద్ర పడటం గమనార్హం. అలాగే ఈ డిక్లరేషన్ ఆమోదం పొందేందుకు కృషి చేసిన జీ20 దేశాల మంత్రులు, అధికారుల ప్రతినిధులకు.. ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మరో విషయం ఏంటంటే ఉక్రెయిన్‌లో నెలకొన్న సంఘర్షణలపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుగం.. యుద్ధాల యూగం కాదని చెప్పింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వంతో కూడిన ప్రపంచ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. సమస్యలకు పరిష్కారం కాదని.. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. అలాగే ప్రజలకు సేవలు అందించేందుకు నూతన ఆవిష్కరణలకు భద్రమైన, నమ్మకమైన పారదర్శకతో కూడిన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయల అవసరాన్ని జీ20 నేతలు గుర్తించారు. అలాగే ఈ డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం జీ20 ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న సూచనను డిక్లరేషన్ కూడా స్వాగతించింది. ఈ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, భద్రతను పెంపొందించాలని అందులో ప్రస్తావించారు. అలాగే మంచి కోసం.. అందరి కోసం అనే నినాదంతో కృత్రిమ మేధ వాడుకోవాలన్నారు.
ఇప్పటికే భారత్‌లో 5జీ టెక్నాలజీ క్రమంగా విస్తరిస్తోన్న తరుణంలో మరో అవకాశం దక్కింది. భారత్, అమెరికా కలిసి 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు అభిప్రాయం కుదుర్చుకున్నాయి. భారత్ 6జీ అలెయన్స్, అలాగే అమెరికాకు చెందిన నెక్స్ట్ జీ అలెయన్స్‌లు 6జీ వైర్‌లెస్ సాంకేతికతను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ (ట్విట్టర్) లో వెల్లడించారు. ఈ 6జీ టెక్నాలజీ వల్ల డిజిటల్ సేవలు మరింత మెరుగ్గా పనిచేస్తాయని.. సాంకేతిక అభివృద్ధి మరింత ముందుకెళ్తుందని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టెలికాం రంగంలో ఇది మరో కొత్త విప్లవాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇరుదేశాలు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Bharat and United States committed to co-develop 6G technology.#G20India pic.twitter.com/KPReyusSkO
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 9, 2023