Rana Daggupati: పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి గురించి ఈ విషయాలు తెలుసా.. సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారంటే..
రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే భల్లాల దేవ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత హీరోగా అంతగా సినిమాలు చేయలేదు. రానా చివరిసారిగా విరాట పర్వం చిత్రంలో కనిపించాడు. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం రాక్షస రాజా చిత్రంలో నటిస్తున్నాడు రానా. నటుడిగానే కాదు.. హోస్ట్ గానూ రానా మెప్పించాడు.

టాలీవుడ్ స్టార్ హీరోలలో రానా దగ్గుబాటి ఒకరు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు.. హీరో విక్టరీ వెంకటేశ్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. లీడర్ సినిమాతో అరంగేట్రం చేసిన రానా.. మొదటి చిత్రాన్ని పొలిటికల్ నేపథ్యంలో ఎంచుకుని నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. అప్పటివరకు హీరోగానే కనిపించిన రానా.. బాహుబలి సినిమాతో విలనిజాన్ని చూపించాడు. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే భల్లాల దేవ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత హీరోగా అంతగా సినిమాలు చేయలేదు. రానా చివరిసారిగా విరాట పర్వం చిత్రంలో కనిపించాడు. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం రాక్షస రాజా చిత్రంలో నటిస్తున్నాడు రానా. నటుడిగానే కాదు.. హోస్ట్ గానూ రానా మెప్పించాడు. IIFA 2వ ఉత్సవం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ షోలను హోస్ట్ చేశాడు. ప్రస్తుతం రానా దగ్గుబాటి నికర విలువ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
1984 డిసెంబర్ 14న జన్మించాడు రానా దగ్గుబాటి. విభిన్న పాత్రల ఎంపికతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. చెన్నైలోని చెట్టినాడ్ విద్యాలయాలంలో చదువుకున్నాడు. ఆ తర్వాత నలంద విద్యాభవన్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అక్కడే ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీని అభ్యసించాడు. రానా దగ్గుబాటి 2010లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు సినిమా లీడర్తో వెండితెరకు పరిచయం అయ్యాడు. డైనమిక్ రాజకీయ నాయకుడు అర్జున్ ప్రసాద్‌గా రానా అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
View this post on Instagram
నివేదికల ప్రకారం రానా దగ్గుబాటి నికర విలువ రూ. 45 కోట్లు. నివేదిక ప్రకారం అతను సంవత్సరానికి రూ.8 కోట్లు సంపాదిస్తుకన్నారట. కేవలం నటుడిగానే కాకుండా .. వాణిజ్య ప్రకటనలు.. బ్రాండ్ అంబాసిడర్ గానూ సంపాదిస్తున్నారు. ప్రతి బ్రాండ్ దాదాపు రూ.70, 80 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా.. తన తండ్రి సురేష్ బాబుతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను చూసుకుంటున్నారు. ఇప్పుడు రానా నిర్మాతగానూ మారారు. ఓటీటీలో వెబ్ సిరీస్.. చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.