Dia Kumari: రాచరికం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మహిళ.. నేడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో రాజ కుటుంబీకులు సైతం రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఈమెకు ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. ఆమె పేరు దియా కుమారి. గతంలో జైపూర్ రాజకుటుంబానికి చెందిన సభ్యురాలు. అయితే ఈమెకు రాజకీయ అనుభవం లేదనుకుంటే పొరబడినట్లే అవుతుంది.

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో రాజ కుటుంబీకులు సైతం రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఈమెకు ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. ఆమె పేరు దియా కుమారి. గతంలో జైపూర్ రాజకుటుంబానికి చెందిన సభ్యురాలు. అయితే ఈమెకు రాజకీయ అనుభవం లేదనుకుంటే పొరబడినట్లే అవుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మ ఎంపిక కాగా.. ఉపముఖ్యమంత్రులుగా ఇద్దరిని నియమితులయ్యారు. అందులో ఒకరు రాజ కుటుంబీకురాలైన దియా కుమారి.
ఈమె రాజ్‌సమంద్ నుండి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా కోరింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై పోటీ చేసి 71 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జైపూర్ రాచరిక పాలనలో చివరి మహారాజు అయిన మాన్ సింగ్ రెండవ మనవరాలు దియా కుమారి. ఎన్నికల బరిలో నిలిచి సామాన్యుల వలే ప్రజల్లో మమేకం అవుతూ ఇంటింటికీ నడుచుకుంటూ వెళ్లిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది. అంత పెద్ద సంస్థానానికి యువ రాణి అయి ఉండి నేలపై నడుచుకుంటూ రావడాన్ని జైపూర్ ప్రజలు స్వాగతించారు. ఆమెకు తగిన గౌరవాన్ని అందించారు.
2013లో బీజేపీలో చేరినప్పటి నుంచి దియా కుమారి పోటీ చేసిన మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె 2013లో సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌సమంద్ నుంచి 5.5 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ నుంచి 71వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర బిజెపి అగ్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌ను దయనీయ స్థితిలోకి నెట్టిందని, రాజస్థాన్‌ను మళ్లీ సురక్షితంగా మారుస్తామని, మహిళలు సురక్షితంగా ఉంటారని, వారికి ఉపాధి లభిస్తుందని, సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎంపికైన శర్మ కష్టపడి పనిచేసే తత్వంగల నాయకుడని ఆమె కొనియాడారు. అతనికి నా శుభాకాంక్షలు. నేను గతంలో అతనితో కలిసి పనిచేశాను, ఇప్పుడు మరోసారి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది” అని ఆమె చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..