ఆ పులి కన్పిస్తే కాల్చిపారేయండి.. తెగేసి చెప్పిన సర్కార్.. ఎందుకంటే
కేరళలోని వాయినాడ్ జిల్లాలో పులి దాడులు కలకలం రేపుతున్నాయి.రక్తం రుచి మరిగిని పులి ఒకటి ఇటీవల వాయినాడ్ జిల్లాలో ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దాడుల క్రమంలో పులిని కట్టడి చేయాలంటూ స్థానికులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు . రైతు ప్రజేష్‌ను పులి చంపి తినడంతో స్థానికంగా అందరిలో భయం పెరిగింది.
కన్పిస్తే కాల్చివేయండి..ఇది టెర్రరిస్టుల కోసం జారీ చేసిన ఆదేశం కాదు. రక్తం రుచి మరిగిన మాన్ ఈటర్‌ను మట్టు పెట్టేందుకు కేరళ సర్కార్ అలా ఉత్తర్వులు ఇచ్చేసింది. కాకపోతే కండీషన్స్ అప్లయ్. కుదిరితే మత్తు ఇంజక్షన్ ఇచ్చి పులిని పట్టుకోవాలి.లేదా బోనులో బంధించాలి. అది సాధ్యం కాని పక్షంలో కాల్చి పడేయాలంటూ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్‌ను జారీ చేసింది. కేరళలోని వాయినాడ్ జిల్లాలో పులి దాడులు కలకలం రేపుతున్నాయి.రక్తం రుచి మరిగిని పులి ఒకటి ఇటీవల వాయినాడ్ జిల్లాలో ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దాడుల క్రమంలో పులిని కట్టడి చేయాలంటూ స్థానికులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు . రైతు ప్రజేష్‌ను పులి చంపి తినడంతో స్థానికంగా అందరిలో భయం పెరిగింది. అంతా అయిపోయాక సీన్‌లోకి వచ్చారని పోలీసులతో గొడవపడ్డారు స్థానికులు. ప్రజేష్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు.
పులిభయంతో వాయినాడ్ జిల్లా వాసులు నిలువెల్లా వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దూసుకు వస్తుందో.. ఎవరిపై పంజా విసురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పులిని కట్టడి చేయకపోతే తాము బలికావడం ఖాయమంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కేరళ ఫారెస్ట్ సిబ్బంది- పోలీసులు టైగర్ హంట్ ఆపరేషన్ చేపట్టారు. పులి జాడలను పసిగట్టేందుకు అడవి బాటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.
స్థానికంగా ఆందోళనలు పెరుగడంతో కేరళ ప్రభుత్వం స్పందించింది. కుదిరితే మత్తుమందు ఇచ్చి పులిని బంధించాలని, అది రక్తం రుచికి మరిగిందని నిర్దారణయితే కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేసింది. పులి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వుంది కాబట్టీ 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని సెక్షన్ 11 కింద ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు కేరళ అటవీ శాఖ పేర్కొంది.అడవి బాటలో పులికోసం వేట మొదలైంది.