Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Smartphones Under 20K: రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి..

పిండి కొద్దీ రొట్టె అన్నట్లు గా ఎంత ఎక్కువ ధర వెచ్చిస్తే అన్ని ఎక్కువ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లున్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఓ మంచి ఫీచర్ ప్యాక్డ్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే రూ. 20,000లోపు టాప్ స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకు అందిస్తున్నాం. వాటిల్లో శామ్సంగ్, జియోమీ, వన్ ప్లస్ వంటి టాప్ బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి.

Best Smartphones Under 20K: రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి..
Iqoo Z7s Smartphone
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 12, 2023 | 8:19 PM

స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుత సమాజంలో ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అది ఓ నిమిషం కూడా గడవదంటే అతిశయోక్తి కాదేమో. పాత కాలంలో కేవలం ఫోన్లు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఫోన్ ఇప్పుడు స్మార్ట్ రూపంలో సమస్తం అరచేతిలోకి తీసుకొచ్చింది. దీంతో అది అనివార్యంగా అందరి చేతుల్లో ఉంటోంది. అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్లు గా ఎంత ఎక్కువ ధర వెచ్చిస్తే అన్ని ఎక్కువ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లున్న కొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఓ మంచి ఫీచర్ ప్యాక్డ్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే రూ. 20,000లోపు టాప్ స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకు అందిస్తున్నాం. వాటిల్లో శామ్సంగ్, జియోమీ, వన్ ప్లస్ వంటి టాప్ బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి.

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ 5జీ..

ఈ ఫోన్ 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే తో ఉంటుంది. 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 13తో ఫోన్ నడుస్తుంది. ఇది 200% అల్ట్రా-వాల్యూమ్ మోడ్‌ను కలిగి ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఫోన్‌లో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దీని ధర అమెజాన్లో రూ. 19,999గా ఉంది.

ఐకూ జెడ్7ఎస్ 5జీ..

ఈ ఫోన్ 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.38-అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఫన్‌టచ్ ఓఎస్ 13తో పనిచేస్తుంది. 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోపాటు 2-మెగాపిక్సెల్ మరో సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ఎస్ఓసీ, అడ్రినో 619ఎల్ జీపీయూ ఉంటాయి. 8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ మెమరీతో వస్తుంది. దీని ధర ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్లో రూ. 17,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ..

ఈ ఫోన్ 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే 240హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ ఓఎల్ఈడీ ప్యానల్ 5000000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 19,739 గా ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం34..

ఈ ఫోన్ 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస ప్లే ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. ఎగ్జినోస్ 1280ఎస్ఓసీ ద్వారా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. 50ఎంపీ మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో పాడు మూడో సెన్సార్ ఉంటుంది. దీని అమెజాన్లో రూ. 19,480గా ఉంది.

మోటోరోలా జీ84..

ఈ స్మార్ట్ ఫోన్ 2400 x 1080 పిక్సెల్‌ల ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో ఉంటుంది. 6.55-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్‌ల బ్రైట్ నెస్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ముందు వైపు సెల్పీ ల కోసం 16ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అమెజాన్లో దీని ధర రూ. 17,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..