- Telugu News Photo Gallery Technology photos These are the methods to know your smartphone battery health
Smartphone: మీ ఫోన్ బ్యాటరీ సరిగ్గానే పనిచేస్తుందా.? ఇలా చెక్ చేసుకోండి..
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనివార్యంగా మారింది. స్మార్ట్ ఫోన్‌తో చేయలేని పని అంటూ ఏది లదు, అన్ని రకాల సేవలు ఫోన్‌తోనే చేసే రోజులు వచ్చేశాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఒక నిత్యవసర వస్తువుగా మారిన సందర్భంలో ఫోన్ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే మీరు ఉపయోగిస్తున్న ఫోన్ బ్యాటరీ ఎలా ఉంది.? ఇంతకీ బ్యాటరీ హెల్తీగానే ఉందా.? లేదా అనే విషయాలను కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు..
Updated on: Dec 12, 2023 | 9:24 PM

ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే. మీ ఫోన్ గత 24 గంటల బ్యాటరీ వినియోగం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.. అనంతరం బ్యాటరీ ఆప్షన్‌కు వెళ్లాలి. గత 24 గంటల్లో బ్యాటరీ వినియోగం ఎంత ఉందో, ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగించిందో తెలుసుకోవచ్చు.

ఇక మీరు సామ్‌సంగ్ బ్రాండ్‌కు చెందిన ఫోన్‌ను ఉపయోగిస్తుంటే.. ప్లే స్టోర్ నుంచి 'శామ్‌సంగ్ మెంబర్ యాప్'ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ఓని 'అసిస్టెంట్' ట్యాబ్ కింద 'సపోర్ట్'కి వెళ్లి, 'ఫోన్ డయాగ్నోస్టిక్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు మీ బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది.

ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారు బ్యాటరీ హెల్త్‌ను తెలుసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి 'AccuBattery' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయాలి. తర్వాత యాప్ పనిచేయడం ప్రారంభించి, మీ బ్యాటరీ హెల్త్‌ను మీకు అందిస్తుంది.

ఇక మీ ఫోన్ డయల్‌ను ఉపయోగించి కూడా ఫోన్ బ్యాటరీ పనితీరును తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా డయల్‌ను ఓపెన్ చేసి ##4636## ని ఎంటర్ చేయాలి. మెనూలో బ్యాటరీ ఇన్ఫర్మేషన్‌ను సెలక్ట్ చేసుకుంటే.. ఛార్జింగ్ లెవల్‌తో పాటు బ్యాటరీ టెంపరేచర్, హెల్త్ ఎలాం ఉందో తెలుసుకోవచ్చు.

మీ ఫోన్ బ్యాటరీ హెల్త్‌ను తెలుసుకోవడానికి CPU-Z అనే యాప్ కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల బ్యాటరీ ఇంక ఎంతసేపు వస్తుంది, బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది.? టెంపరేచర్ ఎంత ఉంది.? లాంటి వివరాలను తెలుసుకోవచ్చు.





























