Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Crackers: ఈ ఏడాది కూడా ఆ రాష్ట్రంలో దీపావళికి బాణాసంచా కాల్చడంపై నిషేధం.. గాలి కాలుష్య నివారణ కోసమే అంటూ ప్రకటన..

శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుంది. ఢిల్లీ నగరంలో సగటు AQI జనవరి నుండి ఆగస్టు వరకు తక్కువగా ఉంటుంది.. అదే శీతాకాలం వచ్చే కొద్దీ గాలి కలుషితమవుతుందని గోపాల్ రాయ్ చెప్పారు. కనుక ఈ ఏడాది కూడా ఢిల్లీలో అన్ని రకాల బాణసంచా తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందని గోపాల్ రాయ్ తెలిపారు.

Diwali Crackers: ఈ ఏడాది కూడా ఆ రాష్ట్రంలో దీపావళికి బాణాసంచా కాల్చడంపై నిషేధం.. గాలి కాలుష్య నివారణ కోసమే అంటూ ప్రకటన..
Diwali Firecrackers
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2023 | 3:28 PM

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో ఒకటి దీపావళి. ఈ పండగ కోసం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తూ ఉంటారు. దీపావళి రోజున దీపాలు వెలిగించడమే కాదు.. బాణాసంచా కాల్చడం కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున కాల్చే బాణాసంచా పై  కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతి ఏడాది దీపావళి రోజున ఢిల్లీలోని గాలి కలుషితమవుతుంది. ఈ నేపథ్యంలో గతేడాది దీపావళి రోజున బాణాసంచా కాల్చడం, అమ్మడంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడానికి వీలు లేదంటూ మరోసారి నిషేధాజ్ఞలను జారీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. చలికాలంలో కాలుష్యం పెరిగిపోతుంది కనుక తాము ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుంది. ఢిల్లీ నగరంలో సగటు AQI జనవరి నుండి ఆగస్టు వరకు తక్కువగా ఉంటుంది.. అదే శీతాకాలం వచ్చే కొద్దీ గాలి కలుషితమవుతుందని గోపాల్ రాయ్ చెప్పారు. కనుక ఈ ఏడాది కూడా ఢిల్లీలో అన్ని రకాల బాణసంచా తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందని గోపాల్ రాయ్ తెలిపారు.

బాణాసంచా అమ్మేందుకు ఢిల్లీ పోలీసులు లైసెన్స్ ఇవ్వకూడదు – మంత్రి

సెప్టెంబర్ 28, 2021న కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీలో బాణసంచా తయారీపై పూర్తి నిషేధం విధించింది. గతేడాది కూడా బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. ఎటువంటి బాణాసంచా అమ్మకాలకు అనుమతి ఇవ్వకూడదని.. తయారు చేసే వారికి ఢిల్లీ పోలీసులు లైసెన్సులు ఇవ్వకూడదని మంత్రి చెప్పారు. ఢిల్లీలోని కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా శీతాకాల కార్యాచరణ ప్రణాళికను కూడా అమలు చేయనున్నామని తెలిపారు మంత్రి గోపాల్ రాయ్.

ఇవి కూడా చదవండి

బాణసంచా కాల్చడాన్ని నిషేధించాలని చెప్పిన సుప్రీంకోర్టు

2018 అక్టోబరు 23న సుప్రీంకోర్టు గ్రీన్‌ పటాకులు వాడాలని ఆదేశించిందని.. అయితే దాని ముసుగులో విషపూరితమైన బాణసంచా తయారు చేయడం ప్రారంభించి వ్యాపారాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు డిసెంబర్ 1, 2020 న గాలి నాణ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని NGT ఆదేశించింది.

చలికాలంలో ఢిల్లీలో కాలుష్య స్థాయి..

దీపావళి పండగను దీపాలు వెలిగించడమే కాదు .. బాణాసంచా కాల్చి జరుపుకుంటారు. ఈ సంప్రదాయం కొన్ని వందల ఏళ్లగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇలా బాణాసంచా కాల్చడం వలనా దీపావళి వెళ్లిన మర్నాడు ఢిల్లీ చుట్టూ పొగ కమ్మేసింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్ , హర్యానాల్లో రైతులు శీతాకాలంలో పొలాల్లో గడ్డిని కాల్చడం ప్రారంభిస్తారు. ఇవన్నీ కలిసి ఢిల్లీలోని గాలి నాణ్యతపై తీవ్ర  ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పంజాబ్, హర్యానా రైతులకు పొలాల్లో గడ్డిని కాల్చవద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..