Dharmendra Pradhan: ఘనంగా ఉత్కల్ గౌరవ్ మధుసూదన్ దాస్ జయంతి వేడుకలు.. హాజరైన ధర్మేంద్ర ప్రధాన్..
ఉత్కల్ గౌరవ్ మధుసూదన్ దాస్ ఆధునిక ఒడిశా రూపశిల్పి అని, దేశంలోని ఆధునిక ఆలోచనాపరులలో అగ్రగణ్యుడు అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉత్కల్ గౌరవ్ మధుబాబు జయంతి కమిటీ ఆధ్వర్యంలో మధుసూదన్ దాస్ 175వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.
ఉత్కల్ గౌరవ్ మధుసూదన్ దాస్ ఆధునిక ఒడిశా రూపశిల్పి అని, దేశంలోని ఆధునిక ఆలోచనాపరులలో అగ్రగణ్యుడు అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉత్కల్ గౌరవ్ మధుబాబు జయంతి కమిటీ ఆధ్వర్యంలో మధుసూదన్ దాస్ 175వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఒడిశా రాష్ట్ర ఏర్పాటులో మధుబాబు ప్రధాన పాత్ర పోషించారన్నారు.
“మధు బాబు ఉత్కల్ సమ్మిలనీని స్థాపించారు. ఇది ఒడిశా సామాజిక, పారిశ్రామిక అభివృద్ధిలో విప్లవాన్ని తీసుకువచ్చింది. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ, విద్య, పారిశ్రామికీకరణ, గ్రామీణాభివృద్ధి, కార్మిక సంస్కరణల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు” అని ప్రధాన్ అన్నారు.
మరోవైపు, మధుబాబుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కటక్‌లోని పలు ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు సంతకాల సేకరణ చేపట్టాయి. సాలిపూర్ బ్లాక్‌లోని సత్యభామాపూర్‌లో ఉన్న మధుబాబు జన్మస్థలాన్ని జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్రంతో పాటు దేశానికి ఆయన ఎనలేని సేవలందించినప్పటికీ, మధుబాబుకు సరైన గౌరవం దక్కలేదు. ఆయనకు మరణానంతరం భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఉత్కల్ గౌరవ్ మధుబాబు జయంతి కమిటీ అధ్యక్షుడు ప్రకాష్ బెహెరా అన్నారు. ప్రచారం సందర్భంగా సేకరించిన సంతకాలను కేంద్రమంత్రి ప్రధాన్ ద్వారా భారత రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్‌కు ఘన స్వాగతం..
ఇదిలాఉంటే.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి సాలిపూర్‌లో ఘన స్వాగతం లభించింది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజాల సంఘాల నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన రాక సందర్భంగా బాణాసంచా కాల్చి పండుగ వాతావరణం క్రియేట్ చేశారు.
सबका साथ, सबका विश्वास
Thank you Salipur for the outpouring of love! ??? pic.twitter.com/8MSHYsWS7E
— Dharmendra Pradhan (@dpradhanbjp) April 28, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..