Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: శబరిమలలో అంతకంతకూ పెరుగుతోన్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?

క్యూలైన్‌లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. పందళంలోని వలియకోయికల్ ఆలయానికి చేరుకుని నెయ్యి అభిషేకం చేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోతున్నవారిలో ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Sabarimala: శబరిమలలో అంతకంతకూ పెరుగుతోన్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?
Sabarimala Temple
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2023 | 6:45 AM

శరణు అయ్యప్పా అంటూ ఆ శబరిగిరీశుని దర్శిస్తే భక్తుల బాగోగులు ఆ స్వామి చూసుకుంటారనీ.. పంపానదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.. కానీ ఆ స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు రావడం.. అదే సమయంలో అధికారులు, ఆలయసిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ లక్ష మందికి పైగా భక్తులు స్వామి దర్శనానికి వస్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల పడుతోంది. క్యూలైన్‌లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. పందళంలోని వలియకోయికల్ ఆలయానికి చేరుకుని నెయ్యి అభిషేకం చేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోతున్నవారిలో ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారాయన.

వారం రోజులుగా శబరిమలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ట్రావెన్‌కోర్‌ అధికారులు-పోలీసుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదునెట్టాంబడి దగ్గర భక్తులు నెమ్మదిగా కదలడం.. 18 మెట్ల దగ్గర పోలీసులు లేకపోవడం.. కేరళ పోలీసులకు.. దేవస్థానం అధికారులకు సమన్వయం లేకపోవడం వల్లే సజావుగా దర్శనం జరగడం లేదని భక్తులు మండిపడుతున్నారు

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం శబరిమలలో పరిస్థితి ఇది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..