EMRS Admit Card: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలివే

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (EMRS)లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులు గురువారం (డిసెంబర్‌ 14) విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ రాత పరీక్షలు డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో జరగనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10,391 పోస్టులను..

EMRS Admit Card: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలివే
EMRS Exam Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2023 | 9:35 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (EMRS)లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులు గురువారం (డిసెంబర్‌ 14) విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ రాత పరీక్షలు డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో జరగనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10,391 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రిన్సిపల్, పీజీటీ, జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ అసిస్టెంట్‌, టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ ఇంటర్‌ విద్యార్ధులు పరీక్ష ఫీజు చెల్లించకపోతే ప్రిన్సిపల్‌కు షోకాజ్‌ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులతో పరీక్ష ఫీజు కట్టించని ప్రిన్సిపాళ్లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఆదేశించారు. ప్రభుత్వ కాలేజీల్లో వందశాతం పరీక్ష ఫీజు కట్టించకపోతే షోకాజ్‌ నోటీసులతోపాటు, ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని ఆర్జేడీలు, జిల్లా వృత్తివిద్యా అధికారులకు సూచించారు. దీంతో విద్యార్థులు ఫీజు చెల్లించకపోతే తమపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రిన్సిపాళ్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రవేశాలు పొంది, మధ్యలోనే మానేస్తుంటారనీ, లేదంటే ఇతర కాలేజీలకు వెళ్లిపోతుంటారని అన్నారు. ఇలాంటి వారికి కూడా తమనే ఫీజు కట్టమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో 5,29,457 మంది ప్రవేశాలు పొందగా.. వారిలో 23,722 మంది పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఇక ద్వితీయ సంవత్సరంలో 4,76,198 మంది ప్రవేశాలు పొందగా..44,291 మంది పరీక్ష ఫీజు కట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్ధులు వందశాతం పరీక్ష ఫీజు చెల్లించాలని, చెల్లించని కాలేజీలల్లో ప్రిన్సిపల్‌ బాధ్యత వహించాలంటూ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడం చర్చణీయాంశంగా మారింది.

ఆర్‌బీఐ గ్రేడ్‌ బి ఆఫీసర్‌ తుది ఫలితాలు విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆఫీసర్‌ (గ్రేడ్‌ బి) నియామక ప్రక్రియ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్ష జులై 9న, మెయిన్స్‌ పరీక్ష జులై 30వ తేదీల్లో జరిగాయి. దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ బ్రాంచుల్లో ఉన్న 291 ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ. 83,254 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఆర్‌బీఐ ఆఫీసర్‌ నియామక తుది ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.