Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Attacks: పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ సాగర్‌శర్మ, మనోరంజన్‌, నీలం, ఆమోల్‌ షిండే, విక్కీశర్మ, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రధాన సూత్రధారి అయిన లలిత్‌ ఝూ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకొని రాజస్థాన్‎లో తలాదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Parliament Attacks: పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
Lalit Jha of the Parliament attacks
Follow us
Srikar T

|

Updated on: Dec 15, 2023 | 9:50 AM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ సాగర్‌శర్మ, మనోరంజన్‌, నీలం, ఆమోల్‌ షిండే, విక్కీశర్మ, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రధాన సూత్రధారి అయిన లలిత్‌ ఝూ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకొని రాజస్థాన్‎లో తలాదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇతని కోసం రాజస్థాన్‎లో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న లలిత్ ఝా ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వెంటనే ఇతనిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పార్లమెంట్‎పై దాడి చేసిన తరువాత బస్సులో రాజస్థాన్‎లోని నాగౌర్‎కు వెళ్లి ఒక హోటల్లో ఉన్నట్లు తెలిపాడు. అలాగే పార్లమెంట్ బయట జరిగిన తతంగాన్ని మొత్తం వీడియో తీసి కోల్‎కత్తాలోని నీలక్ష్ ఐష్‎కు పంపినట్లు పోలీసులు నిర్థారించారు. నీలాక్ష్ ఐష్ కోల్‎కత్తాలో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్లు తెలుస్తోంది. నీలాక్ష్‎ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం ఇప్పటికే కోల్‎కత్తా చేరుకుంది.

ఇదిలా ఉంటే పార్లమెంట్ దాడిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కాప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నాడు నిందితుడు. వీరి వద్ద నుంచి ప్రధాని మిస్సింగ్ అంటూ ముద్రించిన కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం పట్టుబడ్డ నిందితులను ముంబై, మైసూర్‌, లక్నో తీసుకెళ్లి విచారించాల్సిన అవసరం ఉందంటున్నారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. ప్రధానిని కనిపెట్టినవారికి స్విస్‌ బ్యాంక్‌ నుంచి నగదు బహుమతి అంటూ ప్రకటన ఇచ్చేలా ముందుగా పాంప్లెట్లను ముద్రించినట్లు విచారణలో వెల్లడైంది. వీటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రైతుల ఆందోళనలు, మణిపూర్‌ అల్లర్ల నేపథ్యంలో దేశం దృష్టిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్‌పై దాడి చేసినట్టు నిర్థారణ అయింది.

పార్లమెంట్ ఘటనలో 13 మంది లోక్‌సభ సభ్యులపై వేటు..

పార్లమెంట్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 14 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 13 మంది లోక్‌సభ ఎంపీలపై పార్లమెంట్ చర్యలు తీసుకుంది. లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాల ఆందోళనతో నిన్న పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. స్మోక్‌ అటాక్‌ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడ్డారు. విపక్ష ఎంపీల ఆందోళనలతో ఎగువ, దిగువ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. సభాపతి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించారనే కారణంతో.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఈ శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వారిపై వేటు పడింది. ముందుగా 14 మంది లోక్‌సభ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే అందులో ఒక సభ్యుడు ఆ సమయంలో సభలో లేకపోవడంతో వెనక్కి తీసుకున్నారు. ఫైనల్‌గా 13 మంది లోక్‌సభ సభ్యులపై చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

13 మంది సభ్యులు వీళ్లే..

కాంగ్రెస్‌ నుంచి మాణికం ఠాగూర్, బెన్నీ బెహనాన్, వి కె శ్రీకందన్, మహ్మద్ జావేద్, హిబి ఈడెన్, టి ఎన్ ప్రతాపన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్ ఉండగా.. సీపీఎం నుంచి పీ ఆర్ నటరాజన్, ఎస్. వెంకటేశన్ సస్పెండ్ అయ్యారు. ఇక డీఎంకే నుంచి కనిమొళి, సిపిఐకి చెందిన కె సుబ్బరాయన్ పై కూడా సస్పెంన్షన్ వేటు పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదో తరగతి సప్లిమెంటరీ 2025 పరీక్షల టైం టేబుల్‌ విడుదల
పదో తరగతి సప్లిమెంటరీ 2025 పరీక్షల టైం టేబుల్‌ విడుదల
దిల్ రాజు సినిమాలో హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ.. హీరో ఎవరంటే?
దిల్ రాజు సినిమాలో హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ.. హీరో ఎవరంటే?
ట్రాన్స్‌జెండర్ల కోసం ఉస్మానియాలో AI ఓరల్ హెల్త్ స్కానర్
ట్రాన్స్‌జెండర్ల కోసం ఉస్మానియాలో AI ఓరల్ హెల్త్ స్కానర్
ఈ చిన్న చిన్న పనులు చేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది..!
ఈ చిన్న చిన్న పనులు చేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది..!
నాకు దేశమే ముఖ్యం.. అర్షద్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్
నాకు దేశమే ముఖ్యం.. అర్షద్‌ను ఆహ్వానించడంపై మౌనం వీడిన నీరజ్
ఈ నీటితో స్నానం చేస్తే జబ్బులన్నీ పారిపోతాయి..!
ఈ నీటితో స్నానం చేస్తే జబ్బులన్నీ పారిపోతాయి..!
ఇదో వింత ప్రేమ కహానీ.. మనవడితో పారిపోయిన అమ్మమ్మ..
ఇదో వింత ప్రేమ కహానీ.. మనవడితో పారిపోయిన అమ్మమ్మ..
దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ఢాం..!
దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ఢాం..!
చేపల కూర పెట్టిన చిచ్చు..! ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేశారంటే..
చేపల కూర పెట్టిన చిచ్చు..! ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేశారంటే..
'పహల్గామ్‌' మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన టాలీవుడ్ హీరోయిన్
'పహల్గామ్‌' మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన టాలీవుడ్ హీరోయిన్