AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరామునికి రెండు నూలు పోగులు ఉద్యమానికి అనూహ్య స్పందన

శ్రీరామునికి రెండు నూలు పోగులు ఉద్యమానికి అనూహ్య స్పందన

Phani CH

|

Updated on: Dec 14, 2023 | 8:34 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పూణేలో దో ధాగే శ్రీరామ్ కే లియే అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అయోధ్య రామాలయంలో కొలువు దీరనున్న శ్రీరాముడికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే వేలాదిమంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులు ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పూణేలో దో ధాగే శ్రీరామ్ కే లియే అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అయోధ్య రామాలయంలో కొలువు దీరనున్న శ్రీరాముడికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే వేలాదిమంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులు ప్రారంభించారు. శ్రీరామునికి రెండు నూలుపోగులు అనే ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 10 వ తేదీన ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములు అయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. లేస్‌ ప్యాకెట్‌లో రెండే చిప్స్‌.. రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు

సంక్రాంతికి వాస్తున్న చిన్నోడు Vs పెద్దోడు.. బరిలో గెలిచేది ఎవరు ??

యువకుడితో కలిసి పారిపోయిన అమ్మాయి.. అతడి తల్లిని చెట్టుకు కట్టి..

కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి

సముద్రంలో​ ముళ్లబంతుల తొలగింపు