AP Bogus Votes: ఢిల్లీకి చేరిన ఏపీ దొంగ ఓట్ల పంచాయితీ.. సీఈసీకి వైసీపీ, టీడీపీ, బీజేపీ పరస్పర ఫిర్యాదులు.. వాట్ నెక్స్ట్..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ సహా.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో దొంగ ఓట్ల రచ్చ.. ఢిల్లీ లెవల్‌లో హీటు పుట్టిస్తోంది. ఈ ఇష్యూలో ప్రధాన పార్టీలు.. వైసీపీ, టీడీపీ, బీజేపీ సీఈసీ గడపతొక్కడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ సహా.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో దొంగ ఓట్ల రచ్చ.. ఢిల్లీ లెవల్‌లో హీటు పుట్టిస్తోంది. ఈ ఇష్యూలో ప్రధాన పార్టీలు.. వైసీపీ, టీడీపీ, బీజేపీ సీఈసీ గడపతొక్కడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం సీఈసీని కలిసిన వైసీపీ ఎంపీల బృందం.. టీడీపీపై ఫిర్యాదు చేసింది. ఏపీలో ఓటర్ల డేటాను సేకరిస్తున్న టీడీపీ.. దాన్ని లండన్, న్యూయార్క్‌లలోని సర్వర్లలో నిక్షిప్తం చేస్తోందంటూ సీఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. అంతేకాకుండా.. పలు కీలక ఆధారాలను సైతం సమర్పించి.. చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే, వైసీపీ ఫిర్యదు చేసిన అనంతరం టీడీపీ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
ఏపీలోని ఓట్లజాబితాలో జరిగిన అవతవకలపై విచారణ చేపట్టాలని టీడీపీ ఎంపీలు సీఈసీని కలిశారు. దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల్ని సైతం వాలంటీర్లు భయపెడుతున్నారనీ.. ఇదే విషయాన్ని ఈసీకి తెలిపామనీ చెప్పారు. ఇక, ఇదే అంశంపై బీజేపీ నేతలు కూడా సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు.
ఒక్కో ఇంట్లో 67 ఓట్లు సృష్టించారు.. పురంధేశ్వరి
ఏపీ ఓట్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఒక్కో ఇంట్లో 67 పేర్ల మీద ఓట్లు సృష్టించారన్నారు. అదే విషయాన్ని నియోజకవర్గాల వారీగా… సీఈసీకి అన్ని వివరాలూ అందజేశామని పురంధేశ్వరి చెప్పారు.
మూడు ప్రధాన పార్టీలు.. సీఈసీ దగ్గరికి వెళ్లడం.. అదికూడా ఒకే రోజున గంటల వ్యవధిలో ఫిర్యాదు చేయడం.. ఏపీ రాజకీయాల్లో వేడి పెంచేలా కనిపిస్తోంది. దీంతో బోగస్ ఓట్ల రచ్చ ముదురు పాకాన పడ్డట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, సీఈసీ నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..