మోదీ ఆదేశాలతో… జిన్ పింగ్ విందు కోసం పసందైన వంటకాలు

మహాబలిపురం పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కోసం ప్రధాని మోదీ ప్రత్యేక విందునిచ్చారు. తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ రిసార్ట్ అండ్ స్పా లో జరిగిన ఈ విందులో దక్షిణాది వంటకాలతో బాటు చైనీ డిష్ లు కూడా వడ్డించారు. ఈ డిన్నర్ లో వడ్డించాల్సిన వంటకాలను మోదీ స్వయంగా ఎంపిక చేశారట. తమిళనాడు సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె, ఇడియాప్పం, ‘ అరచ్ఛు చిట్ట సాంబార్ ‘, వడ కర్రీ, కడలై కుర్మా, […]

మోదీ ఆదేశాలతో...  జిన్ పింగ్ విందు కోసం పసందైన వంటకాలు
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2019 | 1:47 PM

మహాబలిపురం పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కోసం ప్రధాని మోదీ ప్రత్యేక విందునిచ్చారు. తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ రిసార్ట్ అండ్ స్పా లో జరిగిన ఈ విందులో దక్షిణాది వంటకాలతో బాటు చైనీ డిష్ లు కూడా వడ్డించారు. ఈ డిన్నర్ లో వడ్డించాల్సిన వంటకాలను మోదీ స్వయంగా ఎంపిక చేశారట. తమిళనాడు సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె, ఇడియాప్పం, ‘ అరచ్ఛు చిట్ట సాంబార్ ‘, వడ కర్రీ, కడలై కుర్మా, టమాటో రసం, పనీర్ ఘోస్ట్, బియ్యపు హల్వా, మలబార్ లాబ్ స్టర్, చెట్టినాడు రుచులతో కూడిన మాంసాహార, శాకాహార డిష్ లు వీటిలో ఉన్నాయి. వీటితో బాటు చెనీస్ వంటకాలైన షాంగై నూడిల్స్, మటన్ ఫ్రై, మసాలా చికెన్ టిక్కా… ఇంకా టీ, స్వీట్లు ఉన్నాయి. చైనా నుంచి ప్రత్యేకంగా కుక్ లను రప్పించారు. దాదాపు 70 మందికి పైగా వంటవారు విందుకు హాజరైన సుమారు మూడు వందల మందికి అనేక రకాల వంటకాలను రుచిగా వడ్డించారు. ఇదిలా ఉండగా.. మహాబలిపురం సముద్ర తీర ఆలయం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలను మోదీ-జీ జిన్ పింగ్ వీక్షించారు. చెన్నై కి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ తో బాటు కథాకళి నృత్యాలు, భరతనాట్యాలు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం వీనుల విందుగాను, ..కనువిందుగాను సాగాయి.