లోదుస్తుల్లో లక్షలు విలువ చేసే బంగారం..ఈ కేటుగాడి రూటే సపరేటు!

పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎన్ని జాగ్తత్తలు తీసుకున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. రోజుకో రీతిలో  పసిడిని అక్రమంగా తరలించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు స్మగ్లర్లు. విమానాశ్రయాల్లో అధికారుల కళ్లు కప్పేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో శుక్రవారం ఇలాంటి ఘటనే జరిగింది. ఖతార్ రాజధాని దోహా నుంచి భారత్​కు వచ్చాడు ఓ వ్యక్తి. లోదుస్తుల్లో ఏకంగా 840 గ్రాముల బంగారాన్ని దాచాడు. అధికారులకు చిక్కననుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న కస్టమ్స్​ శాఖ అధికారులు అతడిపై అనుమానం […]

లోదుస్తుల్లో లక్షలు విలువ చేసే బంగారం..ఈ కేటుగాడి రూటే సపరేటు!
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 12, 2019 | 11:37 AM

పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎన్ని జాగ్తత్తలు తీసుకున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. రోజుకో రీతిలో  పసిడిని అక్రమంగా తరలించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు స్మగ్లర్లు. విమానాశ్రయాల్లో అధికారుల కళ్లు కప్పేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో శుక్రవారం ఇలాంటి ఘటనే జరిగింది.

ఖతార్ రాజధాని దోహా నుంచి భారత్​కు వచ్చాడు ఓ వ్యక్తి. లోదుస్తుల్లో ఏకంగా 840 గ్రాముల బంగారాన్ని దాచాడు. అధికారులకు చిక్కననుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న కస్టమ్స్​ శాఖ అధికారులు అతడిపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. అండర్​వేర్​లో రూ.29 లక్షలు విలువ చేసే బంగారాన్ని గుర్తించి విస్తుపోయారు. వెంటనే ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు.