AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదంపై పోరే అజెండా.. ‘ చైనా-భారత్ భాయి..భాయి.. ‘

భారత్-చైనా భాయి.. భాయి అనే రీతిలో సాగుతున్నాయి ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మధ్య సమావేశాలు.. శనివారం వీరు లాంఛనంగా రెండో దఫా చర్చలు జరపనున్నారు. అలాగే మహాబలిపురంలో తాము ఇంకా సందర్శించని ఆలయాలను విజిట్ చేయనున్నారు. మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు. షెడ్యూల్డ్ టైం ని మించి డిన్నర్ యధాప్రకారం ఉండనే ఉంది. తీవ్రవాదం., ఉగ్రవాదం.. ఈ రెండు ఉమ్మడి సవాళ్ళనూ సంయుక్తంగా ఎదుర్కొనేందుకు మోదీ, జిన్ పింగ్ ఓ ప్రకటన […]

ఉగ్రవాదంపై పోరే అజెండా.. ' చైనా-భారత్ భాయి..భాయి.. '
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Oct 12, 2019 | 12:38 PM

Share

భారత్-చైనా భాయి.. భాయి అనే రీతిలో సాగుతున్నాయి ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మధ్య సమావేశాలు.. శనివారం వీరు లాంఛనంగా రెండో దఫా చర్చలు జరపనున్నారు. అలాగే మహాబలిపురంలో తాము ఇంకా సందర్శించని ఆలయాలను విజిట్ చేయనున్నారు. మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు. షెడ్యూల్డ్ టైం ని మించి డిన్నర్ యధాప్రకారం ఉండనే ఉంది. తీవ్రవాదం., ఉగ్రవాదం.. ఈ రెండు ఉమ్మడి సవాళ్ళనూ సంయుక్తంగా ఎదుర్కొనేందుకు మోదీ, జిన్ పింగ్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇండియా, చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి.. వచ్ఛే ఏడాదికి 70 ఏళ్ళవుతాయి. ఆ సందర్భంగా రెండు దేశాల ప్రజల మధ్య విస్తృత సాంస్కృతిక సంబంధాల అభివృధ్దికి ఆదో చక్కని అవకాశం అని సిన్ హువా వార్తా సంస్థ పేర్కొంది. మహాబలిపురంలోని తాజ్ ఫిషర్ మెన్స్ కోవ్ రిసార్ట్ అండ్ స్పా లో ఈ ఇద్దరు నేతలూ శనివారం సమావేశం కానున్నారు. అలాగే రెండు దేశాల ప్రతినిధి బృందాలూ భేటీ కానున్నాయి. ఈ స్పా లోనే మోదీ.. జిన్ పింగ్ కి లంచ్ ఏర్పాటు చేశారు. ఈ భోజనానంతరం సమ్మిట్ పర్యవసానంపై ఇద్దరూ వేర్వేరుగా గానీ, సంయుక్తంగా గానీ ప్రకటనలు చేసే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి ఇరు దేశాల నాయకులూ రెండు దేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య లోటుపై చర్చించారు. దాదాపు 150 నిముషాల సేపు వీరి మధ్య సంప్రదింపులు జరిగాయి. కాస్త ఛలోక్తిగా.. కాస్త సీరియస్ గా మోదీ, జిన్ పింగ్ చర్చలు జరిపినట్టు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.. ఇక మోదీ.. అచ్ఛు తమిళ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం విశేషం. ‘ వెష్టి ‘ వైట్ షర్ట్,అంగవస్త్రం, పంచెకట్టుతో మోదీ, జిన్ పింగ్… సూటుతో కాకుండా వైట్ షర్ట్ ని సాదా ప్యాంట్ లో టకప్ చేసి ఆయన వెంట నడిచారు. మహాబలిపురంలో అర్జునుడు తపస్సు చేసినట్టు చెబుతున్న ప్రదేశాన్ని, శ్రీకృష్ణుడి వెన్న ముద్ద శిలను, పంచరథాలను, ఇతర పురాతన శిల్ప కళా ఖండాలను మోదీ.. జిన్ పింగ్ కు చూపారు. అత్యంత పురాతన ఆలయాల విశిష్టతను వివరించారు. గతంలో మోదీ చైనాలోని ఊహాన్ అనే చారిత్రిక ప్రదేశాన్ని విజిట్ చేసినప్పుడు ‘ హ్యూబే ‘ ప్రొవిన్షియల్ మ్యూజియం కు సంబంధించిన జ్ఞాపికను తాను ఆయనకు బహుకరించిన విషయాన్ని జిన్ పింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.అటు- యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా తాను ఆయనకు చూపినట్టు మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. అతి ప్రాచీన కాలం నుంచే చైనా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలకు ఈ ప్రాంతం పేరు గాంచిందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇండియాలో జిన్ పింగ్ హెలికాఫ్టర్ లో బదులు చైనా తయారీ అయిన ‘ హాంగ్ కీ ‘ వాహనంలో ప్రయాణించడం విశేషం.

Follow Us