ఫిరోజ్ షా కోట్లా.. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్డేడియం పేరు ఇక మారనుంది. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ స్మారకార్థం కోట్లా స్టేడియానికి ఆయన పేరుపెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. గతంలో జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐలోనూ ఆయన ప్రధాన పదవులను చేపట్టారు. క్రికెట్ రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఆయన ఎంతగానో కృషిచేశారు. డీడీసీఏ నిర్ణయంపై అసోసియేషన్ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. జైట్లీ మద్దతు, […]

ఫిరోజ్ షా కోట్లా.. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2019 | 4:54 PM

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్డేడియం పేరు ఇక మారనుంది. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ స్మారకార్థం కోట్లా స్టేడియానికి ఆయన పేరుపెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. గతంలో జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐలోనూ ఆయన ప్రధాన పదవులను చేపట్టారు. క్రికెట్ రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఆయన ఎంతగానో కృషిచేశారు. డీడీసీఏ నిర్ణయంపై అసోసియేషన్ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రూ, రిషబ్ పంత్ వంటి పలువురు క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. స్టేడియం పేరు మార్పు కార్యక్రమం సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ సందర్భంగా కోట్లాలో ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరు పెట్టనున్నారు.