AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ ఒక్క చిన్న ఆధారమైనా చూపండి.. ప్రభుత్వానికి చిద్దూ కుటుంబ సవాల్

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిలుకోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. చిదంబరం సుమారు యాభై ఏళ్లుగా ప్రజా జీవనంలో ఉన్నారని, […]

ఏ ఒక్క చిన్న ఆధారమైనా చూపండి.. ప్రభుత్వానికి చిద్దూ కుటుంబ సవాల్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 27, 2019 | 4:40 PM

Share

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిలుకోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. చిదంబరం సుమారు యాభై ఏళ్లుగా ప్రజా జీవనంలో ఉన్నారని, అలాంటి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఇండియాలోనూ, విదేశాల్లోనూ తనకు ఉన్న ఆస్తుల గురించి ఆయన ఏ విషయాన్నీ దాచలేదని, అటు మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించేలా, తమ ‘ పబ్బం ‘ గడుపుకునేలా వ్యవహరిస్తోందని చిద్దూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగినట్టు నిరూపితమైతేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప..నిరాధారమైన ఆరోపణలతో ఒక వ్యక్తిని దోషిగా ఎలా పరిగణిస్తారని వారు ప్రశ్నించారు. సీబీఐ గురించి నేరుగా ప్రస్తావించకుండా చిదంబరం ఫ్యామిలీ ఈ ప్రకటన విడుదల చేసింది.

Follow Us
గ్యాస్ బండకి పూజ చేసిన మహిళ… పరిస్థితి ఇంత దారుణమా?
గ్యాస్ బండకి పూజ చేసిన మహిళ… పరిస్థితి ఇంత దారుణమా?
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే