Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
మానవహక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్తగా గుర్తింపు పొందిన సాయి బాబా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం ( అక్టోబర్ 11) రాత్రి తుది శ్వాస విడిచారు. . సాయి బాబా రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారని నిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.
మానవహక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్తగా గుర్తింపు పొందిన సాయి బాబా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం ( అక్టోబర్ 11) రాత్రి తుది శ్వాస విడిచారు. . సాయి బాబా రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారని నిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు ఆయన నాగ్‌పూర్ జైల్‌లో శిక్ష అనుభవించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటించింది. దీంతో మార్చి నెలలో నాగ్‌పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన బయట పెద్దగా కనిపంచలేదు. అయితే పది రోజుల క్రితం ఈ ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెషర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన నిమ్స్ హాస్పిటల్లో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం సాయిబాబా కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. పోలియో కారణంగా ఆయన ఐదేళ్ల వయస్సు లోనే వీల్ చైర్ బారిన పడ్డారు. సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లిష బోధించారు. అదే సమయంలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ తర్వాత ఇదే కేసులో జైలు పాలయ్యారు. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయనను తొలగించింది.
నటి స్వరా భాస్కర్ నివాళి..
First Father Stan Swamy & now Prof. Saibaba ! It’s criminal what the Indian State gets away with !! This man with 90% disabilities was wrongly imprisoned & spent 10 years in prison despite being acquitted by the Bombay High Court! Honestly, shame on every single cowardly member… pic.twitter.com/uDR9cxetgj
— Swara Bhasker (@ReallySwara) October 12, 2024
The brave revolutionary Prof G N Saibaba passed away today at a hospital in Hyderabad. Farewell comrade, this news is heartbreaking because you could not even taste a year of freedom.
Incarcerated by the Indian state on charges of being a Maoist sympathizer, Prof Saibaba, with… pic.twitter.com/WMBiiLbL82
— Dr Meena Kandasamy (@meenakandasamy) October 12, 2024