Gold and Silver Price: తగ్గేదేలే అంటూ పెరిగిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ వ్యాప్తంగా దసరా పండగ సంబరాలు ముగిశాయి. దీంతో మరికొన్ని రోజుల్లో రానున్న దీపావళి వైపు దృష్టి సారించారు. ముఖ్యంగా దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండడంతో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. 

Gold and Silver Price: తగ్గేదేలే అంటూ పెరిగిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2024 | 8:55 AM

దేశ వ్యాప్తంగా దసరా పండగ సంబరాలు ముగిశాయి. దీంతో మరికొన్ని రోజుల్లో రానున్న దీపావళి వైపు దృష్టి సారించారు. ముఖ్యంగా దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండడంతో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. వాస్తవంగా గత  కొన్ని సంవత్సరాలుగా దేశంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. ఒకరోజులు బంగారం ధర భారీగా తగ్గితే.. మరొక రోజు ఒక్కసారిగా ఆల్ టైం హైకి చేరుకుంటుంది. అయితే ఈ 2014 సంవత్సరం చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు. పెట్టుబడుల కోసం అయినా లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఈ రోజు (అక్టోబర్ 13వతేదీ)  గోల్డ్ ధర ఏ నగరంలో ఎలా ఉన్నాయో చూద్దాం.

దసరా పండగ రోజున పెరిగిన బంగారం ధర నేడు కూడా స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది .  భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 10 గ్రాములకు 24 క్యారెట్లకు రూ. 40 పెరిగి రూ. 76,430 కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 70,061కు చేరింది.

ఈరోజు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల రూ. 70,052 స్థాయికి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ. 76,420లుగా కొనసాగుతోంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, పొద్దుటూరులో కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

  1. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 69,813లు ఉండగా .. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,160లుగా కొనసాగుతోంది .
  2. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 69,988.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,350,
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,290, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 69,933
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,520, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 70,143

వెండి ధర :

దీపావళి రానున్న వేళ బంగారం తర్వాత వెండి ధరలు కూడా స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ. 91,840లు ఉంది. అయితే ఢిల్లీ లో మాత్రం తెలుగు రాష్ట్రాల కంటే కొంత మేర వెండి ధర తక్కువగా ఉంటుంది .  దీంతో ఈ రోజు ఢిల్లీలో కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 91,540లు గా కొనసాగుతోంది .

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!