AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్ని చట్టాలు వచ్చిన ఆగని అత్యాచారాలు.. ఢిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం.. నోట్లో యాసిడ్ పోసి.. హత్యాయత్నం..

దేశ రాజధాని హస్తినలో ఓ మైనర్ బాలిక పై అత్యాచారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎన్ని చట్టాలు వచ్చిన ఆగని అత్యాచారాలు.. ఢిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం.. నోట్లో యాసిడ్ పోసి.. హత్యాయత్నం..
Delhi News
Surya Kala
|

Updated on: Jul 17, 2022 | 12:46 PM

Share

Delhi News: ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టపడడం లేదు. దేశంలో ఎక్కడోచోట వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని హస్తినలో ఓ మైనర్ బాలిక పై అత్యాచారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 2న అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలవడం కోసం బాధితురాలిని ఇంటికి పిలిపించుకుని.. అత్యాచారం చేసి.. అనంతరం హత్యాయత్నం చేశాడు ప్రకాష్ అనే ఓ వ్యక్తి..

ప్రకాష్ అనే వ్యక్తి.. తన భార్యకు ఆరోగ్యం సరిగాలేదని.. ఓ బాలికను ఇంటికి పని నిమిత్తం పిలిపించుకున్నాడు. బాలికపై అత్యాచారం చేసాడు. తాను చేసిన దారుణాన్ని బాధితురాలు ఎవరికైనా చెబుతుందేమో అనే భయంతో.. బాధితురాలు ఇంటికి వెళుతున్న సమయంలో బలవంతంగా ఆమె నోటిలో యాసిడ్ వంటి ద్రవాన్ని పోసినట్లు పోలీసులు చెప్పారు. ఇంటికి చేరుకున్న బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. చికిత్స నిమిత్తం ఎయిమ్స్ లో చేర్పించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు. శనివారం ఓ ఎన్జీవో సభ్యుడి సమక్షంలో బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిపారు. ప్రకాష్ పై POCSO చట్టం సెక్షన్లు, 307 , 376, 34 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యాయత్నంపై ఫిర్యాదు అందినట్లు మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తాను రోజు కూలీలుగా పనిచేకుంటామని  కుటుంబంతో సహా ఢిల్లీలో నివసిస్తున్నారమని బాలిక తండ్రి కమిషన్‌కు తెలిపాడు. తన తన కూతురు షూ ఫ్యాక్టరీలో పనిచేసేదని చెప్పాడు. ఒకరోజు..  ఫ్యాక్టరీ కాంట్రాక్టర్ తన భార్య అనారోగ్యం బాగోలేదని చెప్పి.. తన కుమార్తెను అతని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. “జులై 5న నిందితుడు తన కూతురికి బలవంతంగా యాసిడ్ తాగించాడని కూడా అతను ఆరోపించాడు. తన కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ దృష్టికి చేరుకోవడంతో ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌, అరెస్టుల వివరాలను కమిషన్‌ కోరింది. ఆసుపత్రిలోనే  బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని మహిళా హక్కుల సంఘం పోలీసులను కోరింది. మహిళా హక్కుల సంఘం బాలిక పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని.. బాధితురాలికి.. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోంది, ”అని మలివాల్ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..