Delhi: ప్రతి ఒక్కరి గుట్టును బయటపెట్టే టెక్నాలజీ.. తమ అరచేతిలో పెట్టుకున్న ఈ సంస్థలు..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్‎పై చర్చ నడుస్తుంది. అటు రాష్ట్రంలోనూ ఇటు దేశవ్యాప్తంగాను మా ఫోన్లు ట్యాప్ చేశారనీ పలువు రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే సాధారణంగా రాజకీయ నాయకులు ఎక్కువ శాతం ఐఫోన్లను మాత్రమే వినియోగిస్తారు. ఈ ఐఫోన్‎లను ట్రాక్, ట్యాప్ చేయడం అంత ఈజీ కాదు. ఇతరులతో మాట్లాడిన సందర్భాల్లోనూ ఎక్కువ శాతం ఐఫోన్‎లోని ఫేస్ టైం ఉపయోగిస్తుంటారు చాలామంది ప్రముఖులు.

Delhi: ప్రతి ఒక్కరి గుట్టును బయటపెట్టే టెక్నాలజీ.. తమ అరచేతిలో పెట్టుకున్న ఈ సంస్థలు..
Forensic Technology
Follow us
Vijay Saatha

| Edited By: Srikar T

Updated on: Apr 13, 2024 | 11:29 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్‎పై చర్చ నడుస్తుంది. అటు రాష్ట్రంలోనూ ఇటు దేశవ్యాప్తంగాను మా ఫోన్లు ట్యాప్ చేశారనీ పలువు రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే సాధారణంగా రాజకీయ నాయకులు ఎక్కువ శాతం ఐఫోన్లను మాత్రమే వినియోగిస్తారు. ఈ ఐఫోన్‎లను ట్రాక్, ట్యాప్ చేయడం అంత ఈజీ కాదు. ఇతరులతో మాట్లాడిన సందర్భాల్లోనూ ఎక్కువ శాతం ఐఫోన్‎లోని ఫేస్ టైం ఉపయోగిస్తుంటారు చాలామంది ప్రముఖులు. దీంతో తమ ఫోన్ ఎక్కడ టాప్ కాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.

ఢిల్లీలోని నెక్సటెక్నోజెన్ అనే సైబర్ ఫోరెన్సిక్ సంస్థ ఐఫోన్‎ను సైతం క్రాక్ చేయగలదు.. ఈ సంస్ధకు క్లైంట్లుగా పలు రాష్ట్రాల పోలీసులు సైతం ఉన్నారు. కేవలం రాష్ట్రాల పోలీసులే కాదు కేంద్ర దర్యాప్తుల సంస్థలు సైతం నెక్స్ట్ టెక్నోజెన్ సేవలను వినియోగించుకుంటున్నట్లు సమాచారం. ఐఫోన్ క్రాకింగ్‎లో ఇజ్రాయిల్‎కు చెందిన సెల్ బ్రైట్ అనే సంస్థ పేరుగాంచింది. సెల్ బ్రైట్ కంపెనీతో నెక్స్ట్ టెక్నోజెన్‎కు సంబంధాలు ఉన్నాయి. దీంతో దర్యాప్తు సంస్థలకు సైతం సెలబ్రేట్ టెక్నాలజీని వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఐఫోన్లను క్రాక్ చేయడం తమ వల్ల కాదంటూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఆపిల్ సంస్థల సహాయాన్ని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి.. కానీ ఆపిల్ నిర్వాహకులు మాత్రం అలా చేసే అవకాశం లేదని చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు.

అయితే ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కొన్ని కేసుల్లో దర్యాప్తు అధికారులు సెలబ్రేట్ టెక్నాలజీని వినియోగించినట్లు తెలుస్తుంది. ఢిల్లి లిక్కర్ స్కామ్‎లోను సెలబ్రేట్ టెక్నాలజీని వినియోగించినట్లు సమాచారం. కీలక నేతలకు సంబంధించిన ఫోన్‎లు క్రాక్ చేసేందుకు ఈ సెల్ బ్రైట్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని సమాచారం. ఈ ఒక్క టెక్నాలజీ ద్వారా సంవత్సరాల తరబడి జరిపిన డేటా మొత్తాన్ని బయటికి తీసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురి ఫోన్లలో ఈడి అధికారులు ఈ టెక్నాలజీని వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా కొన్ని సంవత్సరాల నుండి మాట్లాడిన కాల్స్, జరిపిన చాటింగ్స్, చేసిన ఎస్ఎంఎస్‎లు అన్ని వెలికి తీసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే సెలబ్రేట్ సేవలను కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలే కాకుండా రాష్ట్ర స్థాయి పోలీసులు సైతం ఈ సేవలను వినియోగించుకున్నట్టు సమాచారం. బీహార్, కేరళ, కోల్‎కత్తాతో పాటు 2022లో హైదరాబాద్ పోలీసులు సైతం ఈ సెలబ్రేట్ సేవలను వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీలో సైతం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు నిపుణులు. తెలంగాణ పోలీసులు సైతం సెల్ బ్రైట్‎కు క్లైంట్‎గా ఉన్నట్లు ఈ సంస్థ చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..