Crowdfunding: మరణశిక్షను ఎదుర్కొంటున్న డ్రైవర్‌ను రక్షించేందుకు రూ34 కోట్లు సేకరణ

కేరళలో అతిపెద్ద మావనతా కార్యక్రమం మొదలైంది. సౌదీ జైలులో మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్న మలయాళీ అబ్దుల్ రహీమ్ ప్రాణాలను కాపాడేందుకు కదిలింది. గత 18 సంవత్సరాలుగా మరణశిక్షను అనుభవిస్తున్న కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ విడుదల కోసం ఇక్కడి ప్రజలు రూ.34 కోట్లు సేకరించారు.

Crowdfunding: మరణశిక్షను ఎదుర్కొంటున్న డ్రైవర్‌ను రక్షించేందుకు రూ34 కోట్లు సేకరణ
Abdul Rahim
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 12, 2024 | 7:54 PM

కేరళలో అతిపెద్ద మావనతా కార్యక్రమం మొదలైంది. సౌదీ జైలులో మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్న మలయాళీ అబ్దుల్ రహీమ్ ప్రాణాలను కాపాడేందుకు కదిలింది. గత 18 సంవత్సరాలుగా మరణశిక్షను అనుభవిస్తున్న కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ విడుదల కోసం ఇక్కడి ప్రజలు రూ.34 కోట్లు సేకరించారు. ఉరిశిక్ష అమలుకు మూడు రోజుల ముందు రహీమ్ విడుదల కోసం యాక్షన్ కమిటీ మొత్తం వసూలు చేసింది. ఈ విషయాన్ని కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. క్రౌడ్ ఫండింగ్‌లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కమిటీ సభ్యులు.

క్రౌడ్ ఫండింగ్ కోసం యాక్షన్ కమిటీ మొబైల్ యాప్ ‘SAVEABDULRAHIM’ని ప్రారంభించింది. యాప్‌తో పాటు, మంచి పనికి సహకరించడానికి భారీ సంఖ్యలో ప్రజలు నేరుగా యాక్షన్ కమిటీని సంప్రదించారు. నాలుగు రోజుల్లోనే రూ.24 కోట్లు సమకూరినట్లు సమాచారం. క్రౌడ్ ఫండింగ్ కార్యాలయంగా వ్యవహరిస్తున్న రహీమ్ ఇంటికి మరింత మంది తరలివస్తున్నారు. అవసరమైన మొత్తాన్ని విజయవంతంగా సేకరించిన తర్వాత, విరాళాలను నిలిపివేయాలని కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

కోజికోడ్‌ ఫరూఖ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్‌ 2006లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. రియాద్‌లో హౌస్-డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ అతని విధుల్లో భాగంగా ఇంటిలో అనారోగ్యంతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలుడి సంరక్షణ చూసుకుంటున్నాడు. పిల్లాడి మెడకు అమర్చిన ప్రత్యేక పరికరం సహయంతో ఆహారం అందిస్తున్నారు. అయితే ఒక రోజు కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ జంక్షన్‌లో రెడ్ సిగ్నల్ పడింది. అయితే సిగ్నల్ జంప్ చేయాలంటూ బాలుడు డ్రైవర్ అబ్దుల్ రహీమ్‌‌కు సూచించాడు. అందుక నిరాకరించిన అతనిపై ఉమ్మి వేసిన బాలుడు, వాగ్వివాదానికి దిగి దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే అబ్దుల్ రహీమ్‌ చేయి బాలుడికి అమర్చిన పరికరానికి తగిలి ఉడిపోయింది. దీంతో అపస్మారకస్థితికి చేరిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో బాలుడి కుటుంబం క్షమాభిక్ష మంజూరు చేయడానికి నిరాకరించడంతో, హత్యకు సంబంధించి సౌదీ చట్టం ప్రకారం 2018లో మరణశిక్ష విధించింది కోర్టు. అప్పీల్ కోర్టు ఈ తీర్పును 2022లో సమర్థించింది. ఈ నిర్ణయాన్ని తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం ధృవీకరించింది. ప్రస్తుతం, దియా (బ్లడ్ మనీ)ని అంగీకరించేందుకు మరణించిన బాలుడి కుటుంబంతో ఒప్పందం చేసుకున్న తరువాత, రహీమ్ శిక్ష అమలును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంగీకరించిన మొత్తం 15 మిలియన్ సౌదీ రియాల్స్, దాదాపు రూ. 33.24 కోట్లు, ఇది అక్టోబర్ 16, 2023న ఒప్పందంపై సంతకం చేసిన ఆరు నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుందని బాలుడి కుటుంబం అంగీకరించింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 16లోగా ఇక్కడ జమ చేయకపోతే మరణశిక్ష విధిస్తారు. కుమారుడి విడుదల కోసం అబ్దుల్ రహీమ్ వృద్ధ తల్లి వేడుకుంటోంది. 26 ఏళ్ల వయసులో డ్రైవర్‌గా పని చేసేందుకు సౌదీ అరేబియాకు వచ్చాడు.

కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్‌ను మరణం నుండి రక్షించడానికి డెలివరెన్స్ డబ్బును సమీకరించడానికి ప్రతిజ్ఞ చేసిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త బాబీ చెమ్మనూర్, కేరళ అంతటా యాత్రతో నిధుల సేకరణతో గురువారం తన ప్రయత్నాలను కొనసాగించారు. ఈ యాత్ర గురువారం తిరువనంతపురం నుండి కొచ్చి మీదుగా త్రిసూర్‌కు చేరుకుంది. ఉరిశిక్ష అమలుకు మూడు రోజుల ముందు రహీమ్ విడుదల కోసం యాక్షన్ కమిటీ మొత్తం వసూలు చేసింది. ఈ విషయాన్ని కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…