AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుకూల స్థితిలో గురువు, శుక్రుడు.. ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం..!

గురువు, శుక్రుడు అనుకూలంగా ఉండడమంటే దైవానుగ్రహం పూర్తిగా ఆ రాశుల మీద ఉందనే అర్థం. ఏప్రిల్ నెలంతా ఆరు రాశుల మీద ఈ దైవానుగ్రహం ఉండబోతోంది. ఈ ఏప్రిల్ నెల ఈ రాశుల వారి జీవితాలను మార్చేయడం జరుగుతుంది. ఆరు రాశుల వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత ఏర్పడడం..

అనుకూల స్థితిలో గురువు, శుక్రుడు.. ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం..!
Happy Life Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 12, 2024 | 7:18 PM

Share

గురువు, శుక్రుడు అనుకూలంగా ఉండడమంటే దైవానుగ్రహం పూర్తిగా ఆ రాశుల మీద ఉందనే అర్థం. ఏప్రిల్ నెలంతా ఆరు రాశుల మీద ఈ దైవానుగ్రహం ఉండబోతోంది. ఈ ఏప్రిల్ నెల ఈ రాశుల వారి జీవితాలను మార్చేయడం జరుగుతుంది. ఈ ఆరు రాశులు: మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీనం. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత ఏర్పడడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు చోటు చేసుకోవడం, జీవితంలో పురోగతి చెందడం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం వంటివి ఈ దైవానుగ్రహంలో భాగంగా అనుభవానికి వస్తాయి.

  1. మేషం: శక్తి సామర్థ్యాలకు, దూకుడుకు మారుపేరైన కుజుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల, ప్రస్తుతం కుజుడు బలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఎంతో పట్టుదలగా ఆటంకాలను అధిగమించి ముందుకు దూసుకుపోతారు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా తమ పరిస్థితిని బాగా మెరుగుపరచుకుంటారు. కొత్త కెరీర్ పంథాను ఎంచుకుంటారు. తమను తాము అనేక విధాలుగా తీర్చిదిద్దుకుంటారు. నైపుణ్యాలకు పదునుపెడతారు.
  2. వృషభం: పట్టుదల, ఓర్పు, సహనాలు కాస్తంత ఎక్కువగా ఉండే ఈ రాశివారు కొత్త లక్ష్యాలను ఏర్పరచు కుని, సాధించుకుంటారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని పట్టుదలగా వాటిని ఆచరణలో పెట్టి లభ్ధి పొందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక, వృత్తి, ఉద్యోగాల్లో కష్టపడుతూనే వ్యక్తిగత సుఖ సంతోషాలను మెరుగుపరచుకుంటారు. శుభ గ్రహాల వల్ల కొత్త నైపుణ్యాలను వంటబట్టించుకుంటారు.
  3. కర్కాటకం: దూరదృష్టికి, ఆచరణాత్మక ప్రయత్నాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారు ఈ ఏప్రిల్ నెలలో గురు, శుక్రుల అనుగ్రహంతో కొన్ని కీలకమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుం టారు. ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకుని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. గతాన్ని పక్కనపెట్టి, భవిష్యత్తు మీద దృష్టిపెట్టి, కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటారు. ప్రతి ప్రయత్నం లోనూ శుభ గ్రహాలు వీరికి తోడ్పడుతూ ఉంటాయి. కెరీర్ ఒక కొత్త మలుపు తిరిగే అవకాశముంది.
  4. కన్య: ఏ పని చేసినా ఒక పథకం ప్రకారం చేసే ఈ రాశివారు తమ తెలివితేటలన్నిటినీ ఉపయోగించి, జీవితాన్ని సరైన పంథాలో నడిపిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు తమ రంగాన్ని మెరుగుపరచుకుంటూనే ఆర్థికంగా పురోగతి సాధించడం జరుగుతుంది. ఆర్థికంగా, కెరీర్ పరంగా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, పట్టుదలగా వాటిని సాధించుకుంటారు. తమకున్న కమ్యూనికే షన్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుని లాభదాయక పరిచయాలను పెంపొందించుకుంటారు.
  5. వృశ్చికం: ఆకర్షణ శక్తి, ఆచరణాత్మకత, ప్లానింగ్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉండే ఈ రాశ్యధిపతి కుజుడు ఏప్రిల్ నెలంతా అనుకూలంగా ఉండడంతో పాటు, శుభ గ్రహాల అనుకూలత కూడా పెరుగుతు న్నందు వల్ల జీవితంలో సరికొత్త మార్పుల కోసం ప్రయత్నిస్తారు. వీరిలోని ప్లానింగ్ కారణంగా జీవి తం సమూలంగా మారిపోయే అవకాశం ఉంది. కెరీర్ పరంగా సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మారిపోతుంది. జీవితం అనేక మెట్లుపైకి వెడుతుంది.
  6. మీనం: దూరదృష్టికి, సృజనాత్మకత, ఓర్పుకు ప్రతీక అయిన మీన రాశి వారు తమ ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వృత్తి, వ్యాపారాలను వీలైనంతగా విస్తరించుకుంటారు. ఉద్యో గంలో కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. తమ మనసులోని కోరికలను, లక్ష్యాలను గట్టి పట్టుదలతో, సరికొత్త నైపుణ్యాలతో నెరవేర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడంతో పాటు, ఆర్థికంగా కూడా అంచనాలకు మించి ఉన్నతి సాధిస్తారు.

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..