AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈనెల 15 నుంచి ఆ రాశుల వారికి యోగ కాలం.. వారి జీవితాల్లో పెను మార్పులు పక్కా..!

చర రాశులైన మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారి జీవితాలు ఈ నెల 15 నుంచి క్రమంగా మారిపోబోతున్నాయి. ఈ నాలుగు రాశులతో పాటు, మిథున, ధనూ రాశుల వారి జీవితంలో కూడా పెను మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉండడం, రవి, శుక్రులు ఉచ్ఛపట్టడం..

Zodiac Signs: ఈనెల 15 నుంచి ఆ రాశుల వారికి యోగ కాలం.. వారి జీవితాల్లో పెను మార్పులు పక్కా..!
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 12, 2024 | 7:02 PM

Share

చర రాశులైన మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారి జీవితాలు ఈ నెల 15 నుంచి క్రమంగా మారిపోబోతున్నాయి. ఈ నాలుగు రాశులతో పాటు, మిథున, ధనూ రాశుల వారి జీవితంలో కూడా పెను మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉండడం, రవి, శుక్రులు ఉచ్ఛపట్టడం, గురువు కూడా మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తుండడం వంటి కారణాల వల్ల, అంటే అయిదు గ్రహాల అనుకూలత వల్ల, నాలుగు చర రాశులతో పాటు మిథున, ధనూ రాశుల వారి జీవితాలు మూడు నెలల పాటు అనేక విధాలుగా ఉచ్ఛ స్థితికి, ఉన్నత స్థానాలకు పురోగమించడం జరుగుతుంది.

  1. మేషం: దూసుకుపోయే తత్వం ఎక్కువగా కలిగిన ఈ రాశివారు అయిదు గ్రహాల అనుకూలత వల్ల ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక అవకాశాలను బాగా సద్విని యోగం చేసుకుంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు సంపాదించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. పట్టు దలగా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. తప్పకుండా మహాభాగ్య యోగం కలుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి నవమ, దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం జరగడం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శక్తి సామర్థ్యాలకు బాగా పదును పెడతారు. గట్టి పట్టుదలతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుం టారు. సూక్ష్మబుద్ధికి ప్రతిరూపాలైన ఈ రాశివారు సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలను పరి ష్కరించుకుంటారు. రాజకీయాలు, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మరింతగా అదృష్టం కలిసి వస్తుంది.
  3. కర్కాటకం: ఏ రంగంలో ఉన్నప్పటికీ అంకిత భావంతో, నిబద్ధతతో వ్యవహరించే ఈ రాశివారికి అష్టమ శని కూడా అనుకూలంగా మారి, అందలాలు ఎక్కించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో పదోన్న తులు సాధించుకుంటారు. వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఒక పెద్ద సంస్థకు అధిపతిగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారు రాజకీయాల్లో ఉన్న పక్షంలో తప్ప కుండా అభివృద్ధి సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు మార్మోగిపోతాయి. సంపన్నుల స్థాయికి చేరతారు.
  4. తుల: ఈ రాశివారికి అనేక విధాలుగా కలిసి రావడం, ఏ రంగంలో ఉన్నా డిమాండు పెరగడం వంటివి జరుగుతాయి. ఒక పథకం ప్రకారం వృత్తి, వ్యాపారాలను తీర్చిదిద్దుకుంటూ వాటిని పురోగమింపజేసే ఈ రాశివారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశముంది. ఏ రంగంలో ఉన్నా ఈ రాశివారు కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకు వెళ్లడం జరుగుతుంది. ప్రత్యర్థులు, పోటీదార్లు, శత్రువుల మీద ఈ రాశివారిదే పైచేయిగా ఉంటుంది.
  5. ధనుస్సు: ఈ రాశ్యధిపతి అయిన గురువుతో పంచమంలో ఉచ్ఛ గ్రహం రవి కలవడం వల్ల ఈ రాశివారికి ఏ విధంగా చూసినా ప్రాభవం పెరుగుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడంతో పాటు యాంబి షన్ ఎక్కువగా ఉండే ఈ రాశివారు ఆకాశమే హద్దుగా దూసుకు పోతారు. ఏ రంగంలో ఉన్నప్ప టికీ ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశముంది. వ్యాపారాల్లో కూడా డిమాండు ఏర్పడు తుంది. అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి.
  6. మకరం: ఈ రాశివారికి రాశ్యధిపతి శనితో సహా అయిదు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల, అధిక యోగం పడుతుంది. అధికార యోగంతో పాటు, ఆర్థిక యోగాలు కూడా పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. తప్పకుండా పదోన్నతి లభించే అవకాశ ముంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడంతో పాటు రాబడి కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే సమయం అంత యోగదాయకంగా ఉంటుంది.

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో