Delhi YouTuber: తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చడంలో కలిగే సంతృప్తి ఎంతో ప్రత్యేకం. ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ తన అమ్మానాన్నల చిరకాల కోరికను నెరవేర్చి వారి కళ్లల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. యూప రెబే అనే యువతి తన తల్లిదండ్రులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇద్దరినీ తొలిసారి విమానం ఎక్కించింది. తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చడంలో కలిగే సంతృప్తి ఎంతో ప్రత్యేకం. ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ తన అమ్మానాన్నల చిరకాల కోరికను నెరవేర్చి వారి కళ్లల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. యూప రెబే అనే యువతి తన తల్లిదండ్రులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇద్దరినీ తొలిసారి విమానం ఎక్కించింది.
తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చడంలో కలిగే సంతృప్తి ఎంతో ప్రత్యేకం. ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ తన అమ్మానాన్నల చిరకాల కోరికను నెరవేర్చి వారి కళ్లల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. యూప రెబే అనే యువతి తన తల్లిదండ్రులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇద్దరినీ తొలిసారి విమానం ఎక్కించింది. జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే వారి చిరకాల కోరికను నెరవేర్చి సర్‌ప్రైజ్ చేసింది. కాగా అపురూపమైన ఆ ఆనంద క్షణాలను యూప రెబే తన సెల్‌ఫోన్‌లో బంధించింది. తొలిసారి విమానాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురవ్వడం వీడియోల్లో కనిపించింది. విమానం ఎక్కడానికి ముందు సంతోషంగా ఫొటోలు దిగారు. విమానం టేకాఫ్‌కు ముందు రెబే తండ్రి దేవుడిని తలచుకొని ప్రార్థిస్తున్నట్టుగా వీడియోలో కనిపించింది.
‘‘కొందరికి ఇది కేవలం ఒక విమాన ప్రయాణం మాత్రమే కావొచ్చు. కానీ కొందరి కల నిజమైంది’’ అంటూ తల్లిదండ్రుల తొలి విమాన ప్రయాణ అనుభవం గురించి యూప రెబే సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ప్రత్యేకమైన రోజు కోసం ఇద్దరినీ రెడీ చేయడాన్ని చాలా ఇష్టపడినట్లు చెప్పింది. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీలాంటి కూతురిని ఇచ్చినందుకు మీ నాన్న దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. చాలా అద్భుతంగా, అందంగా అనిపిస్తోంది. మీ అమ్మగారి జుట్టుని అలంకరించడం నుంచి మీ నాన్న కోరుకున్న క్షణాలను సెల్‌ఫోన్‌లో బంధించడం వరకు ఒక అనుభవాన్ని వారికి బహుమతిగా అందించారు అని పేర్కొన్నాడు. సగటు మధ్యతరగతి భారతీయుల సంస్కృతి ఇదేనని, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని మరో వ్యక్తి మెచ్చుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.