AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: విశ్వనాథ ఆలయంలో ‘పోలీసు పూజారి’.. అలాంటి అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా..

వారణాసి పోలీసు డ్రెస్ కోడ్ మారింది. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ తీసుకున్న నిర్ణయంపై ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేతలు తీవ్ర విమర్శలు మొదలు పెట్టారు. పోలీసు సిబ్బంది యూనిఫారానికి బదులు పూజారులు ధరించాల్సిన దుస్తులను ధరించే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరి మదిలో తలెత్తే ప్రశ్నలు. అసలు కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని అనుకుంటుంటే.. డ్రెస్ కోడ్ ను మార్చడం వెనుక ఉన్న రీజన్ గురించి తెలుసుకుందాం.. 

Varanasi: విశ్వనాథ ఆలయంలో 'పోలీసు పూజారి'.. అలాంటి అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా..
Varanasi Police Uniform
Surya Kala
|

Updated on: Apr 13, 2024 | 7:20 AM

Share

ఎవరైనా ఇప్పుడు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలోకి వెళితే అక్కడ ఉన్నవారిని చూసి పూజారులు అనుకుని మోసపోకండి. ఎందుకంటే అతను పూజారి లేదా పోలీసు కావచ్చు. బహుశా ఇలా చెప్పడం వలన కొంచెం వింతగా ఫీల్ కావొచ్చు. అయితే వాస్తవానికి ఇది పూర్తిగా నిజం. ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారుల వేషధారణలో కొంతమంది పోలీసులను మోహరించారు. వారణాసి పోలీసు డ్రెస్ కోడ్ మారింది. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ తీసుకున్న నిర్ణయంపై ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేతలు తీవ్ర విమర్శలు మొదలు పెట్టారు.

పోలీసు సిబ్బంది యూనిఫారానికి బదులు పూజారులు ధరించాల్సిన దుస్తులను ధరించే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరి మదిలో తలెత్తే ప్రశ్నలు. అసలు కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని అనుకుంటుంటే.. డ్రెస్ కోడ్ ను మార్చడం వెనుక ఉన్న రీజన్ గురించి తెలుసుకుందాం..

  1. గత కొద్ది రోజులుగా కాశీ విశ్వనాథ దేవాలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని పోలీసు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
  2. దీంతో భక్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, నెట్టివేయడం వంటి  ఫిర్యాదులు పలుమార్లు వినిపించాయి. ఆలయంలో పోలీసుల తీరుపై ఆరోపణలు వచ్చాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. అంతే కాకుండా ఆలయంలో పోలీసులను చూసి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నట్లు గుర్తించారు.
  5. ఈ కారణాలను గురించిన అధికారులు ఆలయంలో విభిన్నమైన పోలీసింగ్ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని భావించి డ్రెస్ కోడ్ విషయంలో అటువంటి నిర్ణయం తీసుకున్నారు.
  6. పూజారి మాటలను భక్తులు తేలిగ్గా స్వీకరిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే అర్చకుల వేషధారణలో పోలీసులను మోహరించారు.
  7. అంతేకాకుండా కాశీ విశ్వనాథ దేవాలయంలో నో టచ్ పాలసీ ఉంది.

వారణాసి పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఒకే షిప్టులో 6 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వీరందరికీ గర్భగుడి బాధ్యతలను అప్పగించారు. వీరిలో ఇద్దరు పోలీసులు కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో అర్చకుల వేషధారణలో ఉంటారు. మిగిలిన నలుగురు పోలీసులు  గర్భగుడిలోని వివిధ ద్వారాల వద్ద మోహరించనున్నారు.

రాజకీయ దుమారం కూడా మొదలు

వారణాసి కమిషనరేట్ నిర్ణయంపై ఇప్పుడు యూపీలో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తొలి పోస్ట్ చేశారు. పోలీసులు పూజారుల వేషం ధరించడం ఏ ‘పోలీస్ మాన్యువల్’ ప్రకారం సరైనదని ఆయన ట్వీట్‌లో ప్రశ్నించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చే వారిని సస్పెండ్ చేయాలి. రేపు ఏ దుండగుడైనా దీన్ని సద్వినియోగం చేసుకుని అమాయక ప్రజానీకాన్ని లూటీ చేస్తే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పరిపాలన ఏమి సమాధానం చెబుతుంది.. ఇది  ఖండించదగిన చర్య అంటూ పేర్కొన్నారు.

నో టచ్ పాలసీ అంటే ఏమిటి?

  1. ఈ విధానం ప్రకారం పోలీసులు భక్తులను ముట్టుకోరు.
  2. భక్తులను పోలీసులు బయటకు నెట్టడంపై నిషేధం విధించారు.
  3. పోలీసులు కేవలం విజ్ఞప్తి చేసి భక్తులను ముందుకు వెళ్లమని కోరతారు.
  4. పూజారి వేషధారణలో ఉన్న ఈ పోలీసులు గుడి దగ్గర, గర్భగుడిలో రద్దీని నియంత్రిస్తారు.
  5. అదే సమయంలో ఈ పోలీసులు భక్తులకు మార్గనిర్దేశం చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..