AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేష రాశిలో బుధ శుక్రల కలయిక.. ఏర్పడనున్న లక్ష్మీనారాయణ రాజయోగం.. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశుల సొంతం..

ఇతర గ్రహాలతో సంయోగం జరగడం వలన కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు శుభ, అశుభకరమైన ఫలితాలను ఇస్తాయి. కొన్ని రాజయోగాలు శుభాలను తెస్తాయి. ఈ నేపథ్యంలో మే నెలలో మేషరాశిలో బుధుడు, శుక్రుడు కలయిక జరగనుంది. మేషరాశి వేదికగా ఈ గ్రహాల కలయికతో పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారు ఆర్ధికంగా ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..  

మేష రాశిలో బుధ శుక్రల కలయిక.. ఏర్పడనున్న లక్ష్మీనారాయణ రాజయోగం.. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశుల సొంతం..
Budh Shukra Yuti In Mesh Rashi 2024
Surya Kala
|

Updated on: Apr 13, 2024 | 7:00 AM

Share

మానవ జీవితంలో మంచి చెడులు, సుఖ దుఃఖాలను నిర్ణయించేందుకు రాశుల్లో గ్రహాల గమనం అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగుపెట్టే సమయంలో కొన్ని సార్లు ఇతర గ్రహాలతో సంయోగం జరగడం వలన కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు శుభ, అశుభకరమైన ఫలితాలను ఇస్తాయి. కొన్ని రాజయోగాలు శుభాలను తెస్తాయి. ఈ నేపథ్యంలో మే నెలలో మేషరాశిలో బుధుడు, శుక్రుడు కలయిక జరగనుంది. మేషరాశి వేదికగా ఈ గ్రహాల కలయికతో పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారు ఆర్ధికంగా ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మేషరాశి: ఈ రాశి వేదికగానే బుధుడు, శుక్రుడు కలయిక జరిగి.. లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో వీరు ఆర్ధికంగా స్థిరపడతారు. ఉద్యోగస్థులు శుభవార్త వింటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది.

మిధున రాశి: ఈ రాశికి చెందిన వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం ఉద్యోగానికి సంబంధించిన గుడ్ న్యూస్ ను వింటారు. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలగి సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి ప్రతి పనిలోనూ అండగా నిలబడతారు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు లక్ష్మీ నారాయణ రాజయోగం వలన  అదృష్టం కలిసి వస్తుంది.  వ్యాపారులు భారీగా లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషముగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారి కష్టం ఫలిస్తుంది గుడ్ న్యూస్ వింటారు. దంపతుల మధ్య సుఖ సంతోషాలుంటాయి. కష్టాలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు. అప్పులను తీర్చి రుణ విముక్తులవుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు