Delhi Air Pollution: నెల రోజుల్లోనే గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. చిత్రాలను రిలీజ్ చేసిన నాసా.. స్కూళ్లకు సెలవును పొడిగింపు..

ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం కల్లోలం సృష్టిస్తోంది. గాలి చాలా వరకు విషపూరితంగా తయారైంది. అయితే.. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదు.. దాని పరిసర రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ విషపూరిత పొగలు అలుముకున్నాయి. అవి ఎంతలా అంటే.. విషపూరిత పొగ బంగాళాఖాతం వరకు వ్యాపించిందంటూ నాసా ఆసక్తికర చిత్రాలను విడుదల చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆకాశం నిండా పొగలు అలుముకున్నాయి.

Delhi Air Pollution: నెల రోజుల్లోనే గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. చిత్రాలను రిలీజ్ చేసిన నాసా.. స్కూళ్లకు సెలవును పొడిగింపు..
Pollution In Delhi
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2023 | 7:22 AM

కొన్నాళ్లుగా ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి నాణ్యత సూచీ అత్యంత తీవ్రమైన స్థాయిని సూచిస్తోంది. స్కూళ్లకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించింది కేజ్రివాల్ సర్కార్. వాహనాల సరి-బేసి పద్ధతి కూడా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ కొన్ని ఛాయాచిత్రాలు విడుదల చేసింది నాసా. పంజాబ్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఒక దట్టమైన పొర స్పష్టంగా కనిపిస్తోందిక్కడ.

ఉత్తరాదిలో పంట వ్యర్థాల్ని తగలబెట్టడం కారణంగా ఏర్పడ్డ కాలుష్యానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఇటీవలి కాలంలో పంట దగ్ధం 740 శాతం పెరిగిందని, అక్టోబర్ 29న ఒక్కరోజే వెయ్యికి పైగా ఇటువంటి కేసులు నమోదయ్యాయని పేర్కొంది యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా. దీపావళి సమీపిస్తుండడంతో, బాణాసంచా పేలుళ్ల వల్ల గాలి నాణ్యత మరీ దారుణంగా పడిపోవచ్చని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతాంగాన్ని అప్రమత్తం చేయకపోతే.. ఢిల్లీ నివాసయోగ్యతను కోల్పోవచ్చని హెచ్చరిస్తోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. మరోవైపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో ఢిల్లీలోని విద్యాసంస్థలకు సెలవుల్ని పొడిగించింది. నవంబర్‌ 09 నుంచి 18 దాకా సెలవులు ఉంటాయని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం కల్లోలం సృష్టిస్తోంది. గాలి చాలా వరకు విషపూరితంగా తయారైంది. అయితే.. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదు.. దాని పరిసర రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ విషపూరిత పొగలు అలుముకున్నాయి. అవి ఎంతలా అంటే.. విషపూరిత పొగ బంగాళాఖాతం వరకు వ్యాపించిందంటూ నాసా ఆసక్తికర చిత్రాలను విడుదల చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆకాశం నిండా పొగలు అలుముకున్నాయి. దానికి సంబంధించి.. ప్రస్తుతం చూస్తున్న ఈ చిత్రాలే నాసా తాజాగా విడుదల చేసింది. ఇక ఈ నెల ఫస్ట్ న రిలీజ్‌ చేసిన ఇమేజ్‌లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇందులో తాజా చిత్రానికంటే కంటే తక్కువ విషపూరితమైన పొగ కనిపిస్తుంది. పరిస్థితి అలాగే ఉన్నప్పటికీ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన కేటగిరీలో ఉంది. నాసా వరల్డ్‌వ్యూ నుంచి వచ్చిన విజువల్స్ భారతదేశంలోని మైదానాలను పొగమంచు దట్టమైన దుప్పటిని కప్పివేసినట్లు చూపించాయి.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో బుధవారం వాయుకాలుష్యం 421 పాయింట్లుగా నమోదైంది. ఇది తీవ్రమైన కేటగిరీకి చెందినది. పొరుగున ఉన్న ఘజియాబాద్‌లో గాలి నాణ్యత సూచిక 382, ​​గురుగ్రామ్ 370, నోయిడా 348, గ్రేటర్ నోయిడా 474, ఫరీదాబాద్ 396 గా ఉన్నాయి. ఈ నెల 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 400కి మించి నమోదైంది. అంటే.. ఈ ప్రాంతాల్లో గాలి ‘తీవ్ర’ స్థాయికి చేరుకుంది. అంతేకాదు.. ఢిల్లీలోని చాలా చోట్ల 300 మించి ఉంది. ఈ స్థాయి అక్కడి వాతావరణం ‘వెరీ పూర్’ కేటగిరీ కిందకే వస్తుండటం భయపెడుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది గాలి నాణ్యతను కొలిచే సంఖ్య. దీని ద్వారా గాలిలో కాలుష్య స్థాయిని కూడా గుర్తిస్తారు. ఆ రీడింగ్‌ల ఆధారంగా, గాలి నాణ్యతను ఆరు వర్గాలుగా విభజించారు. మరోవైపు.. వాయు కాలుష్యం కారణంగా గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో మాస్క్‌ ధరించాల్సిందేనని చెప్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..