Cash-For-Query Case: మహువా మోయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేయండి..! లోక్‌సభకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు
ప్రశ్నకు నోటు అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ‘ప్రశ్నలకు లంచం వ్యవహారం’.. జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.. ఈ క్రమంలో ఎంపీ మహువా మోయిత్రా ఎంపీగా కొనసాగేందుకు అనుమతించవద్దని.. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది.
ప్రశ్నకు నోటు అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ‘ప్రశ్నలకు లంచం వ్యవహారం’.. జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.. ఈ క్రమంలో ఎంపీ మహువా మోయిత్రా ఎంపీగా కొనసాగేందుకు అనుమతించవద్దని.. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. విచారణ జరిపిన అనంతరం.. మహువా మొయిత్రా చర్యలను “అత్యంత అభ్యంతరకరం, అనైతికం, హేయమైన.. నేరం”గా పేర్కొంటూ, కఠినంగా శిక్షించాలని కమిటీ కోరింది. కమిటీ మొత్తం విషయంపై ఈ మేరకు 500 పేజీల నివేదికను రూపొందించింది. “చట్టపరమైన, ఇంటెన్సివ్, సంస్థాగత మరియు కాలపరిమితితో కూడిన విచారణ” జరగాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. మహువా మొయిత్రా “అనధికారిక వ్యక్తులతో” యూజర్ ఐడిని పంచుకున్నారని, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదు.. సౌకర్యాలను తీసుకున్నారని.. అంతేకాకుండా దుష్ప్రవర్తనతో వ్యవహరించారని కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది.
పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాకు డబ్బులు చెల్లించినట్లు ఓ వ్యాపారవేత్త చేసిన ఆరోపణలతో పెను దుమారం రేగింది. ఈ వ్యవహారం అంతా ప్రధాని కార్యాలయం నుంచే నడుస్తోందని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె ఖండిస్తూ వచ్చారు. దీంతో ఆమెపై నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా.. పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ విచారణ చేపట్టింది. నవంబర్ 2వ తేదీన ఎథిక్స్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు కూడా. అయితే విచారణ మధ్యలోనే ఆమె వెళ్లిపోవడం, ఆ సమయంలో ఎథిక్స్ కమిటీపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అయితే కమిటీ గత భేటీకి హాజరైన మొయిత్రా, చైర్మన్ తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ వాకౌట్ చేశారు. ఈ ఉదంతంపై కమిటీ నేడు మరోసారి భేటీ కానుంది. డబ్బులకు ప్రశ్నలడిగిన ఉదంతంలో మొయిత్రాను దోషిగా తేలుస్తూ స్పీకర్‌కు కమిటీ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. అదే జరిగితే దానితో విభేదిస్తూ కమిటీలోని విపక్ష సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కున్వర్ దానిష్ అలీ నోట్ ఇస్తారని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..