Bus Accident: జమ్ముకశ్మీర్ రోడ్డు ప్రమాదంలో 10కి పెరిగిన మృతుల సంఖ్య.. స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి కొంతమంది యాత్రికులు జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు బస్సులో యాత్రికులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Bus Accident: జమ్ముకశ్మీర్ రోడ్డు ప్రమాదంలో 10కి పెరిగిన మృతుల సంఖ్య.. స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్
Bus Accident
Follow us

|

Updated on: May 30, 2023 | 3:05 PM

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి కొంతమంది యాత్రికులు జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు బస్సులో యాత్రికులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఝజ్జర్ కొట్లి ప్రాంతలో బస్సు అదుపుతప్పడంతో రోడ్డుపై జారి లోయలో పడిపోవడం కలకలం రేపింది. మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

అయితే ఆ బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మొదటగా 7 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మరోముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. మరో 55 మంది తీవ్ర గాయలపాలయ్యారు. ప్రస్తుతం బస్సు నుంచి అందర్నీ బయటికీ తీసినట్లు జమ్మూ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సానుభూతి తెలిపి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..