AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : కర్ణాటక నెక్స్ట్ సీఎం ఎవరో తేల్చేసిన నాగసాధులు.. వీడియో వైరల్

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై ఫైట్ ఓ రేంజ్ లో జరుగుతోంది.. ప్రస్తుతం సీఎంగా సిద్దరామయ్య ఉన్నారు.. అయితే ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం మేరకు కొత్త సీఎంగా డి. కే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది..డీ కే శివకుమార్ తన ఇంట్లో ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వగా.. ఒక్కసారిగా కొందరు నాగ సాధులు ఆయన ఇంట్లోకి వచ్చి.. ఇక నువ్వు డిప్యూటీ సీఎం కాదు.. సీఎం అవ్వబోతున్నావడం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ నాగ సాధుల మాటలు విన్న కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.

Watch : కర్ణాటక నెక్స్ట్ సీఎం ఎవరో తేల్చేసిన నాగసాధులు.. వీడియో వైరల్
Karnataka Cm Controversy
Ch Murali
| Edited By: |

Updated on: Nov 24, 2025 | 6:32 PM

Share

గత ఎన్నికల్లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇద్దరు నేతలకు సీఎం చెరో రెండున్నర సంవత్సరాలు సీఎం బాధ్యతలు అప్పగిస్తానని చెప్పింది. ఇదే మాటను సిద్దరామయ్య, డి కే శివకుమార్‌ చెప్పి ఒప్పందం కుదిర్చింది. అయితే మొదటగా సీఎం బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య పదవికాలం ముగిసే సమయం ఆసన్నమైంది.. దీంతో డీకే శివకుమార్ సీఎం పదవిని చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా కర్ణాటకలోని సదాశివ నగర్‌లో ఉన్న తన ఇంట్లో మనకి బాత్ కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కీలక నేతల పాల్గొన్నారు.

అయితే కార్యక్రమం జరుగుతుండగా కాశీ నుంచి నాగ సాధువులు నేరుగా డీకే శివకుమార్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. వారు డీకే శివకుమార్ దగ్గరకు వచ్చి.. ఆయన తలపై చెయ్యి పెట్టి మీరు డిప్యూటీ సీఎం కాదు.. సీఎం నువ్వే అని ఆశీర్వదించారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఇక డీకే శివకుమార్ సీఎం అంటూ అభిమానులు డీకే శివకుమార్ మద్దతు ఎమ్మెల్యేలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

ఇంతకు కాంగ్రెస్ అధిష్టాణం ఒప్పందం ప్రకారం.. డీకే శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెడుతుందా.. లేదా సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగిస్తుంది అనేది వేచి చూడాలి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ జాతీయ నాయకుడైనా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లికార్జున్ కార్గే కూతురై ప్రియాంకను కూడా అక్కడి సీఎం రేసులో ఉందంటూ కొంత ప్రచారం జరుగుతుందోంది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us