Cyclone Tauktae Tracker and Updates: తీరం తాకకముందే భయపెడుతున్న తౌక్తా.. కేరళలో జోరుగా కురుస్తున్న వర్షం..
cyclonic storm Tauktae: కేరళ రాష్ట్రంపై తౌక్తా బుసలు కొడుతోంది. అప్పుడే తన ప్రభావంను చూపిస్తోంది. వేగంగా వీస్తున్న గాలులకుతోడు భారీ వర్షం పడుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తా తుఫాను తీవ్రతరం
కేరళ రాష్ట్రంపై తౌక్తా బుసలు కొడుతోంది. అప్పుడే తన ప్రభావంను చూపిస్తోంది. వేగంగా వీస్తున్న గాలులకుతోడు భారీ వర్షం పడుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తా తుఫాను తీవ్రతరం దాల్చడంతో కేరళలో శనివారం ఉదయం నుంచి జోరుగా వర్షం పడుతోంది. మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్‌గోడ్‌తో సహా ఉత్తర జిల్లాలో భారీ వర్షం కురిసినట్లుగా ఐఎండీ అంచనా వేసింది. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కోజికోడ్ జిల్లాలోని వడకర గ్రామంలో వంద కుటుంబాలతో పాటు లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో కాసరగోడ్‌లో అలలు ఎగిపడుతున్నాయి.
రాష్ట్రంలో కొవిడ్ -19 ప్రోటోకాల్స్ అమలులో ఉన్నందున ప్రస్తుతం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. తౌక్టే తుఫాను ఈ నెల 17-18 మధ్య తీరం దాటుందని భావిస్తుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
15-05-2021; 1250 IST; Thunderstorm with light to moderate intensity rain with wind speed 20-40 kmph would occur over Fathehabad, Narwana, Kaithal, Karnal (Haryana), Iglas, Kasganj (U.P.) and adjoining areas during next 2 hours. pic.twitter.com/GjuFZl4YbY
— India Meteorological Department (@Indiametdept) May 15, 2021
తుఫాను నేపథ్యంలో ఎన్‌డీఆర్ 53 బృందాలను అందుబాటులో ఉంచింది. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసింది.