India Corona: దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
India Corona: దేశంలో కరోనా మహహ్మారి తగ్గుముఖం పడుతోంది. రెండేళ్లకుపైగా విజృంభిస్తున్న కరోనా (Corona).. ప్రస్తుతం అదుపులో ఉంది. దేశంలో (India) కరోనా పరిస్థితులపై కేంద్ర..
India Corona: దేశంలో కరోనా మహహ్మారి తగ్గుముఖం పడుతోంది. రెండేళ్లకుపైగా విజృంభిస్తున్న కరోనా (Corona).. ప్రస్తుతం అదుపులో ఉంది. దేశంలో (India) కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ (Health Bulletin) విడుదల చేసింది. తాజాగా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 9 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 6,396 మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 201 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,51,556 చేరగా, మృతుల సంఖ్య 5,14,589కు చేరింది. నిన్న 13,450 మంది కోవడ్ నుంచి కోలుకోగా, మొత్తం రివకరీలు 4.23 కోట్లకు చేరింది. ఇక క్రియాశీల కేసులు 69,897 చేరాయి. ఇక నిన్న 24,84,412 మందికి టీకాలు అందించగా, ఇప్పటి వరకు 178 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్, ఇతర ఆంక్షల కారణంగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నాయి రాష్ట్రాలు. తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెంది మరింత ఆందోళనకు గురి చేసింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరింత ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ప్రస్తుతందేశంలో అన్ని రాష్ట్రాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
ఇవి కూడా చదవండి: