Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 4th Wave: కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు..!

Covid 4th Wave: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతోంది. ఇక థర్డ్‌వేవ్‌లో ముగిచబోతోంది. ఈ వేవ్‌లో పాజిటివ్‌ కేసులు పెద్దగా నమోదు కాలేదు...

Covid 4th Wave: కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 27, 2022 | 7:10 PM

Covid 4th Wave: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతోంది. ఇక థర్డ్‌వేవ్‌లో ముగిచబోతోంది. ఈ వేవ్‌లో పాజిటివ్‌ కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఇప్పుడు ఫోర్త్‌వేవ్‌ (4th Wave) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ వేవ్‌లో కరోనా (Corona) ఎలా ఉంటుందనేది ఆందోళన వ్యక్తం అవుతుంది. సెకండ్‌వేవ్‌ నుంచి థర్డ్‌వేవ్‌ (Covid Third Wave)వరకు దాదాపు 6 నెలల గ్యాస్‌ తీసుకున్న కోవిడ్‌.. ఈ సారి నాలుగు నెలలకే రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఈ థర్డ్‌వేవ్‌తో కరోనా పీడ వదిలిపోతుందని అనుకునే లోపే శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. నాలుగోవేవ్‌కు నాలుగు నెలలే సమయం ఉందని, వచ్చే జూన్‌లో ఫోర్త్‌వేవ్‌ ఎంట్రీ ఇచ్చి అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలో థర్డ్‌వేవ్‌ దాదాపు ముగిసినట్లే. ఇప్పుడు నాలుగో వేవ్‌ దశ జూన్‌ 22 నాటికి ప్రారంభం అవుతుందని తాజాగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నాలుగో వేవ్.. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు.

అయితే నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయన్నారు వెల్లడించారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేసింది ఐఐటీ కాన్పూర్‌ సైంటిస్టులు మాత్రమే.

ఇక మరో వైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో త ఎలిపింది. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తదితర కారణాలతో 243 మంది మరణించారు. దీంతో కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 5,13,724కి చేరింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తుంటే థర్డ్‌వేవ్‌లో కూడా కేసులు పెద్దగా నమోదు కావని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా కట్టడికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించడం ముఖ్యమంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Hyderabad: భాగ్యనగరంలో ఆ మూడు రోజులు ఇంటింటికి బూస్టర్ డోసు బంద్.. ఎందుకంటే..

Booster Dose: బూస్టర్‌ డోసుతోనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి

వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..