Booster Dose: బూస్టర్‌ డోసుతోనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి

Booster Dose: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ (Third Wave)లో తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం..

Booster Dose: బూస్టర్‌ డోసుతోనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి
Follow us

|

Updated on: Feb 24, 2022 | 10:58 AM

Booster Dose: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ (Third Wave)లో తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కరోనా తగ్గు్ముఖం పట్టినా.. కొత్త కొత్త వేరియంట్లను పుట్టుకొస్తున్నాయి. డెల్టా, ఒమిక్రాన్‌ లాంటి వైరస్‌లు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ (Vaccination) ప్రక్రియ వేగవంతం అవుతోంది. ప్రస్తుతం రెండు డోసులు తీసుకుంటున్నారు. ఇక బూస్టర్‌డోస్‌ కూడా వచ్చింది. అయితే కరోనా గత వేరియంట్ల ప్రభావం నుంచి కోలుకుని రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నా ఒమిక్రాన్‌ (Omicron) సోకిన వారికి యాంటీబాడీల రక్షణ అంతగా ఉండదని ఓ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. అలెర్జీ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితం అయ్యాయి. కేవలం మూడో డోసు (Booster Dose) తీసుకున్నవారిలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు మాత్రమే కొంత వరకు ఒమిక్రాన్‌ను అడ్డుకుంటాయని పరిశోధకులు తేల్చారు.

ఆస్ట్రేలియాలోని వియెన్నా మెడికల్‌ యూనివర్సిటీ పరిశోధకులు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకుని వేరియంట్ల నుంచి కోలుకున్న కొంత మందిలోని యాంటీబాడీల స్థాయి, డెల్టా, ఒమిక్రాన్‌ తదితర వేరియంట్లపై నిరోధక శక్తిని పరిశీలించారు పరిశోధకులు. ఈ వ్యక్తుల్లోని యాంటీబాడీలు డెల్టాను అడ్డుకోగలుగుతున్నా, ఒమిక్రాన్‌ను అడ్డుకోవడంలో విఫలమవుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే మూడో డోసు తీసుకున్నవారిలో మాత్రమే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం గుర్తించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. నిన్న ఎన్నంటే..?

CJI NV Ramana: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్..25 రోజులు అవుతున్నా ఇబ్బంది పడుతున్నా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..