CJI NV Ramana: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్..25 రోజులు అవుతున్నా ఇబ్బంది పడుతున్నా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..

కోవిడ్ వైరస్​(Covid-19) కొత్త వేరియంట్ ఒమిక్రాన్​‌ను(Omicron) సైలెంట్​ కిల్లర్​గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ(CJI NV Ramana) అభివర్ణించారు. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

CJI NV Ramana: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్..25 రోజులు అవుతున్నా ఇబ్బంది పడుతున్నా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Feb 23, 2022 | 6:32 PM

కోవిడ్ వైరస్​(Covid-19) కొత్త వేరియంట్ ఒమిక్రాన్​‌ను(Omicron) సైలెంట్​ కిల్లర్​గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ(CJI NV Ramana) అభివర్ణించారు. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒమిక్రాన్​ నుంచి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని అభిప్రయాపడ్డారు. కోవిడ్‌పై పూర్తిస్థాయిలో భౌతిక విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్​ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోరగా.. జస్టీస్ ఎన్వీ రమణ ఈ కామెంట్స్ చేశారు. ఒక్కరోజులోనే 15వేల కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. వెంటనే స్పందించిన వికాస్..అది ఒమిక్రాన్. తీవ్రత స్వల్పమే అని నివేదించారు.  నేను మొదటి వేవ్‌లో బాధపడ్డాను.. కానీ నాలుగు రోజుల్లో కోలుకున్నాను. కానీ ఇప్పుడు ఈ వేవ్‌లో 25 రోజులు అవుతున్నా ఇంకా బాధపడుతున్నాను” అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ప్రజలు త్వరగానే కొలుకుంటున్నారని న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు.

శరీరంలోని అవయవాలపై తీవ్రమైన ప్రభావం..

అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా మందిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కసారి కరోనా (Corona) వచ్చిందంటే శరీరంలోని అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కరోనా వచ్చిన వారిలో అనేక అనారోగ్యకరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్య నిపుణులు ఇప్పటికే తెలియజేశారు. ఇక కరోనా వైరస్‌ గుండె (Heart)లోని సూక్ష్మ రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ (University of Bristol) పరిశోధకుల బృందం అధ్యయనం ద్వారా తేల్చింది.

ఇదిలావుంటే.. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా తుగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం ఇటీవల రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) తగ్గుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో (సోమవారం) దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 235 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితోపోల్చుకుంటే.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,81,075 (0.42%) కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,21,15,839 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,12,344 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 34,226 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,21,58,510 కి పెరిగింది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,75,83,27,441 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: Nawab Malik: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ అరెస్ట్.. దావూద్ ఇబ్రహీంతో ఉన్న లింకులపై ఈడీ ఆరా..