Nawab Malik: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ అరెస్ట్.. దావూద్ ఇబ్రహీంతో ఉన్న లింకులపై ఈడీ ఆరా..

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్ ( Dawood Ibrahim)తో సంబంధం ఉందనే ఆరోపణలతో NCP నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను(Nawab Malik) బుధవారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు( Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు.

Nawab Malik: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ అరెస్ట్.. దావూద్ ఇబ్రహీంతో ఉన్న లింకులపై ఈడీ ఆరా..
Nawab Malik
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 23, 2022 | 4:03 PM

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్ ( Dawood Ibrahim)తో సంబంధం ఉందనే ఆరోపణలతో NCP నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను(Nawab Malik) బుధవారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు( Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు. ఏడుగంటల పాటు విచారించిన తరవాత ఆయన్ను అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ను కొద్దిరోజుల క్రితమే నవాబ్‌ మాలిక్‌ను అరెస్ట్‌ చేసింది. కస్కర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాలిక్‌ను అదుపు లోకి తీసుకుంది ఈడీ . దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ ను ఈడీ అధికారులు అంతకు ముందు ఆయనను తీసుకెళ్లి విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్​ మాలిక్​ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దావూద్‌ గ్యాంగ్‌తో పాటు ఇతర మాఫియా ముఠాల నుంచి నవాబ్‌ మాలిక్‌ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను లొంగబోనని అరెస్ట్‌ తరువాత స్పందించారు నవాబ్‌ మాలిక్‌.

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబై లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మాలిక్​. ఉదయం 7 గంటలకు విచారణ చేపట్టారు. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహిం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని విచారించినట్లుగా తెలుస్తోంది. దావూద్​ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్​ సోదరుడు ఇబ్రహిం కస్కర్​తో సహా పలు అనుమానిత నిందితులకు సంబంధించిన సంబంధాలపై ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

దావూద్​, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్​ మాలిక్​ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు ఉన్నాయి. దీంతో దావూద్​కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు.

ఇవి కూడా చదవండి: Petrol Prices Hike: వాహనదారులపై పెరగనున్న పెట్రో భారం.. లీటరుకు ఎంత పెరుగుతున్నాయంటే..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా