Cancel Board exam 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!
సిబీఎస్సీ, సిఐఎస్‌సిఇ ఈ ఏడాది ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్న 10, 12వ తరగతల పరీక్షలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌ను బుధవారం (ఫిబ్రవరి 23) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది..
SC dismisses plea challenging offline CBSE offline exams: సిబీఎస్సీ, సిఐఎస్‌సిఇ ఈ ఏడాది ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్న 10, 12వ తరగతల పరీక్షలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌ను బుధవారం (ఫిబ్రవరి 23) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 2022 విద్యాసంవత్సరానికి గానూ నిర్వహించనున్న ఫిజికల్ పరీక్షలను రద్దు చేయాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్ధులందరికీ ఇంటర్నల్ అసెస్‌మెంట్ కోరుతూ.. విద్యార్ధలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS), ఇతర రాష్ట్ర బోర్డులు, బాలల హక్కుల కార్యకర్త అనుభ శ్రీవాస్తవ సహాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. కాగా ఆఫ్‌లైన్ పరీక్షలను రద్దుపై దాఖలైన పిటిషన్లు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తాయని, ఇలాంటి పిటిషన్లను మీరెలా దాఖలు చేస్తారు? ఇవి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెల్పింది.
[HEARING UPDATE IN BOARD EXAMS CASE]
Matter will be heard at 2 pm now#SupremeCourt @cbseindia29 #BoardExams2022 @anubha1812 https://t.co/AtCkaDUBvQ
— Bar & Bench (@barandbench) February 23, 2022
Also Read: