AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో ఎన్నంటే..?

India Coronavirus Updates: భారత్‌లో కరోనావైరస్ కేసులు తుగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం ఇటీవల రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.

India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో ఎన్నంటే..?
Shaik Madar Saheb
|

Updated on: Feb 23, 2022 | 9:33 AM

Share

India Coronavirus Updates: భారత్‌లో కరోనావైరస్ కేసులు తుగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం ఇటీవల రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కేసులు 20 వేలకు దిగువన నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం భారీగా తగ్గిన (Coronavirus) కేసుల సంఖ్య.. మంగళవారం స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 278 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితోపోల్చుకుంటే.. 1697 కేసులు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,64,522 (0.38%) కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,28,67,031 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,12,622 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.

కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 31,377 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి (Covid-19) కోలుకున్న వారి సంఖ్య 4,21,89,887 కి చేరింది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,76,19,39,020 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Viral Video: ఎవరైతే నాకేంటి.. కుక్కకు చుక్కలు చూపించిన కప్ప.. భీకర పోరాటంలో గెలిచిందెవరంటే..?

Watch Video: మళ్లీ విస్ఫోటనం చెందిన ఎట్నా అగ్నిపర్వతం.. ఆ ప్రాంతంలో రెడ్ అలెర్ట్‌.. వీడియో..

Follow Us
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్