Watch Video: మళ్లీ విస్ఫోటనం చెందిన ఎట్నా అగ్నిపర్వతం.. ఆ ప్రాంతంలో రెడ్ అలెర్ట్.. వీడియో..
Mount Etna erupts: ప్రపంచంలోని పెద్ద అగ్నిపర్వతాల్లో ఇటలీలోని ఎట్నా ఒకటి.. అది ఒక్కసారిగా విస్పోటనం చెందింది. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో విమాన సర్వీసులను కూడా నిలిపేశారు.
Mount Etna erupts: ప్రపంచంలోని పెద్ద అగ్నిపర్వతాల్లో ఇటలీలోని ఎట్నా ఒకటి.. అది ఒక్కసారిగా విస్పోటనం చెందింది. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో విమాన సర్వీసులను కూడా నిలిపేశారు. దక్షిణ ఇటలీ (Italy) లోని ఎట్నా అగ్నిపర్వతం, ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో (Mount Etna ) ఇది ఒకటి. ఈ అగ్ని పర్వతం మళ్లీ విస్ఫోటనం చెందింది. భారీ స్థాయిలో లావా, బూడిదను వెదజల్లింది. సిసిలీ ద్వీపంలోని 3వేల 326 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఎట్నా అగ్నిపర్వతం.. ఈ ఏడాది రెండోసారి బద్దలవడం (Etna erupts) కలకలం రేపుతోంది. ఈ పర్వతం ద్వారా వచ్చిన బూడిద 11 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. దీంతో కాటానియా గగనతలంపై రెడ్-కోడెడ్ హెచ్చరికను జారీ చేశారు అక్కడి అధికారులు. కాటానియా విమానాశ్రయంలోని రన్‌వేను బూడిద కప్పేసింది. దీంతో విమానాలను నిలిపేశారు.
కాగా.. ఎట్నాలోని అగ్నిపర్వతం చుట్టూ పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్టు చెబుతున్నారు. ఎట్నా అగ్నిపర్వతాన్ని మౌంట్ ఎట్నా అని కూడా పిలుస్తారు. ఇటలీ దక్షిణ భాగంలో సిసిలీ తూర్పు తీరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. ఈమధ్య ఇది వరుసగా విస్ఫోటనం చెందుతోంది. మౌంట్ ఎట్నా, టూరిజాన్ని ఆకర్షించే అగ్నిపర్వతం. అంతేకాదు స్థానిక ద్వీపానికి ప్రధాన ఆదాయ వనరు కూడా. ఇది వేల సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. 2001లో మొదటిసారి ఇది వరుస విస్ఫోటనాలు చెందింది. అటు సిసిలీ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది, ఎట్నా పర్వతం యొక్క వాలులలో నివసిస్తున్నారు. దీంతో విస్పోటనం చెందిన ప్రతీసారి అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతుంటారు.
వీడియో..
ERUPTION: Italy’s Mount Etna roars into action, sending a plume of smoke and ash miles into the sky over Sicily. https://t.co/dAtWqP7htw pic.twitter.com/tG55yXdgFn
— ABC News (@ABC) February 22, 2022
2014, 2016, 2017 సంవత్సరాల్లో ఇది విస్పోటనం చెందింది. అతిపెద్ద విస్పోటనం మాత్రం 1992లో జరిగిందని చెబుతున్నారు అక్కడి అధికారులు. 1669లో ఎట్నా పర్వతం క్రింద ఉద్భవించిన భూకంపంతో, నికోలి పట్టణం ధ్వంసమైంది. అప్పుడు దాదాపు 1500 మంది మరణించారు. ఆ సమయంలో భారీగా లావా రావడంతో, ఒకపెద్ది కందకాన్ని తీసి, దాంట్లోకి లావాను మళ్లించారు అక్కడి ప్రజలు. దీంతో ప్రాణనష్టం తప్పింది. లేకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవారని చెబుతుంటారు.
Also Read: