Viral Photo: ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్!

టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా..

Viral Photo: ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్!
Virat Kohli
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2022 | 8:22 AM

టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా విరాట్ కోహ్లీనే స్వయంగా దీనిని ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం విశేషం. అసలే అక్కడ రన్ మెషిన్.. ఇంకేముంది ఫ్యాన్స్ క్షణాల్లో ఆ ఫోటోపై వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఏంటి.? ఎందుకంత స్పెషల్.? అనేది ఇప్పుడు చూద్దాం..

ఓ స్మార్ట్ ఫోన్ యాడ్ కోసం విరాట్ కోహ్లీ.. అచ్చుగుద్దిన్నట్లు తనలా ఉన్న 10 మంది వ్యక్తులతో కలిసి నటించాడు. ఆ యాడ్‌ చిత్రీకరణ సమయంలో వారితో కలిసి దిగిన ఓ ఫోటోను విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అందులో రియల్ విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో కనిపెట్టాలని ఫ్యాన్స్‌కు సవాల్ విసిరాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. అసలు ఇంతకీ అందులో రియల్ విరాట్ కోహ్లీ ఉన్నాడా.? అని డౌట్ వ్యక్తపరుస్తున్నారు. మరి మీరు కూడా ఓసారి లుక్కేయండి. అందులో విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో కనిపెట్టండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి..