Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా.. కైవ్, ఖార్కివ్‌లో భీకర దృశ్యాలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన కొద్ది క్షణాల తర్వాత, ఉక్రెయిన్‌లోని కైవ్, ఖార్కివ్ ప్రాంతాలలో పెద్ద పేలుళ్లు సంభవించాయి. ఇందుకు సంబంధించి US-ఆధారిత BNO న్యూస్ వీడియో ఫుటేజీ విడుదల చేసింది...

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా..  కైవ్, ఖార్కివ్‌లో భీకర దృశ్యాలు
Russia Ukraine War
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 24, 2022 | 10:34 AM

ముందు నుంచి అలుముకున్న యుద్ధమేఘాలు యాక్షన్‌లోకి వచ్చాయి. ముందు నుంచి దూకుడు ప్రదర్శించిన రష్యా.. ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ప్రపంచ దేశాలన్నీ ప్రతిఘటిస్తున్నా.. యుద్ధానికి కాలుదువ్వింది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఒక కాలు వెనక్కి వేసినట్లు కనిపించినా.. ఉక్రెయిన్ ఒక అడుగు ముందుకు వేయడంతో రష్యా రెండడుగులు ముందుకు వేసింది.అర్ధరాత్రి సమయంలో ఉన్నపళంగా దాడికి దిగిన రష్యా.. ఉక్రెయిన్ ఊపిరిపీల్చుకోకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ బేస్‌లపై దాడి, ఎయిర్‌పోర్ట్‌ల(AirPort)పై అటాక్, విద్యుత్ వ్యవస్థపై దాడి.. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా ప్రణాళికతో దాడికి దిగినట్లు అర్థం అవుతుంది. కీ జోన్స్‌(Kyiv)పై దాడి చేసి.. ఎదురుదాడి చేయకుండా పక్కాగా ప్రణాళిక రచించినట్లు రష్యా(Russia Ukraine War) తాజా దాడులు స్పష్టం చేస్తున్నాయి.

ఉన్నపళంగా దాడికి తెగబడ్డ రష్యా.. ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. మూడు వైపుల నుంచి దాడి చేసి.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. ఏ వ్యవస్థ పనిచేయాలన్నా.. విద్యుత్ అంత్యంత ముఖ్యం. ఆ వ్యవస్థను కొలాప్స్ అయ్యేలా దాడులకు తెగపడింది రష్యా. ఆ తర్వాత దాడులపై ఎదురుదాడి చేయాలంటే ఎయిర్‌పోర్ట్‌లు, ఎయిర్‌బేస్‌లు చాలా కీలకం. ఏకంగా 11 నగరాల్లో.. ఆయా కేంద్రాలను సెర్చ్ చేసి అటాక్ చేసింది రష్యా.

అంతకుముందు టెలివిజన్ ప్రసంగంలో, వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్యను నిర్వహించడానికి రష్యన్ దళాలకు అధికారం ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే మిలటరీ ఆపరేషన్ మొదలైందని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాలు ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే ‘ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది’ హెచ్చరికలు పంపారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు. కాగా ఉక్రెయిన్‌లో నాలుగుచోట్ల మిస్సైల్ ఎటాక్స్‌ చేసింది రష్యా. డాడ్‌బస్‌లోకి రష్యా మిలటరీ చొచ్చుకెళ్లింది. ఉక్రెయిన్‌పై మూడువైపుల నుంచి దాడి ప్రారంభించింది రష్యా. త్రిశూలవ్యూహంతో ఉక్రెయిన్‌ని చుట్టేసింది. నాటో, అమెరికా దేశాల హెచ్చరికలు రష్యా బేఖాతర్ చేసింది. ఉక్రెయిన్ – రష్యా మధ్య ఉద్రిక్తతతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.

పుతిన్ ప్రకటనపై అమెరికా వెంటనే స్పందించింది. రష్యా చేసే ఈ దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనికి నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

Read Also..Russia Ukraine War Live: యుద్ధం మొదలైంది.. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగిన రష్యా