Russia Ukraine War Live: యుద్ధం ఆపాలి.. పుతిన్ కు మోడీ ఫోన్..

Sanjay Kasula

| Edited By: Basha Shek

Updated on: Feb 24, 2022 | 11:18 PM

Russia Ukraine Conflict Live Updates in Telugu: యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్‌ సిటీస్‌ను టార్గెట్‌ చేసింది రష్యా. కేపిటల్‌ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.

Russia Ukraine War Live: యుద్ధం ఆపాలి.. పుతిన్ కు మోడీ ఫోన్..
Ukraine Russia War

Russia Ukraine Conflict Live Updates: యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్‌ సిటీస్‌ను టార్గెట్‌ చేసింది రష్యా. కేపిటల్‌ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ను మూడు వైపులా నుంచి చుట్టుముట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టింది రష్యా సైనం. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని బాంబుల మోత మోగిస్తోంది. మిలటరీ ఆపరేషన్‌కు దిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌ కేపిటల్‌ కీవ్‌ను ఆక్రమించింది రష్యా. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను ముట్టడించింది రష్యా. బెలారస్, క్రీమియా, లుహాన్స్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ఎంటరైన రష్యా బలగాలు, ఒకేసారి మూకుమ్మడి దాడికి దిగాయి.

ఉక్రెయిన్‌సై సైనిక చర్యకు దిగిన పుతిన్, అమెరికా అండ్ నాటో కంట్రీస్‌కు డైరెక్ట్ వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం ప్రతీకారం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు పుతిన్. చరిత్రలో మీరు చూసిన పరిణామాలకు మిమ్మల్ని దారితీస్తుందని.. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌లో మా ప్రణాళికలు ప్రత్యేక సైనిక చర్యలో ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఉక్రెయిన్‌పై సైనిక చర్య అన్యాయమన్నారు అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్. రష్యా ఎటాక్‌కి ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో మరణాలకు ప్రపంచానికి రష్యా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు బైడెన్‌. ఉక్రెయిన్‌పై రష్యా ఎటాక్‌పై అత్యవసరంగా సమావేశమైంది ఐరాస భద్రతా మండలి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఆపాలని కోరింది. అయితే, ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటున్నారు రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్.

ఇదిలావుంటే, రష్యా దాడులతో దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్‌. రష్యా ఎటాక్స్‌ నుంచి తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అటు, ఉక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసేయడంతో విమానాల రాకపోకలకు బ్రేక్‌ పడింది. దాంతో, ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో భారతీయుల భద్రత ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు.

లైవ్ వీడియో కోసం ఇక్కడ చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Feb 2022 11:02 PM (IST)

    రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన యూకే..

    ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై బ్రిటన్ మరిన్ని ఆంక్షలను విధించింది.  యూకే ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యన్ బ్యాంకులను తొలగించింది.  రష్యా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేలా   రష్యన్ ప్రభుత్వ బ్యాంక్ వీబీటీ ఆస్తులను సీజ్ చేసింది. అదేవిధంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలపై నిషేధం విధించింది.

  • 24 Feb 2022 10:55 PM (IST)

    కీవ్ పై మూడోసారి వైమానిక దాడులు..

    ఉక్రెయిన్ పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా నగరంపై విరుచుకు పడుతున్నాయి. 14 గంటల వ్యవధిలో ఇది మూడో దాడి కావడం గమనార్హం.  మొత్తం 8 ఎయిర్ క్రాఫ్ట్ లతో రష్యా సైనిక బలగాలు దాడులు చేశాయి.

  • 24 Feb 2022 10:47 PM (IST)

    మా విద్యార్థుల క్షేమం గురించి ఆలోచించండి..

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై  యుద్ధం ఆపాలని ఆయనకు మోడీ సూచించారు. అదేవిధంగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో ఇబ్బందలు పడుతున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని మోడీ గుర్తు చేశారు.

  • 24 Feb 2022 10:16 PM (IST)

    రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోడీ మాట్లాడే ఛాన్స్..

    మరికాసేపట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా తెలిపారు. ఉక్రెయిన్‌లో తలెత్తుతున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

  • 24 Feb 2022 10:11 PM (IST)

    కాసేపట్లో అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన..

    ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో ఇప్పటికే ఆంక్షలు విధించిన అమెరికా.. మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైట్ హౌస్‌లో  జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించారు అధ్యక్షుడు జో బైడెన్​. ఉక్రెయిన్​పై రష్యా దాడులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.

  • 24 Feb 2022 10:08 PM (IST)

    మధ్యాహ్నం 12.48 గంటల సమయంలో..

    మధ్యాహ్నం 12.48 గంటల సమయంలో రష్యా సైన్యాలు ఖార్కివ్‌, లుహాన్స్క్‌ వైపు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయి.. 1.14కు సముద్ర మార్గాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది రష్యా.. మూడు వైపుల నుంచి సాగిన దాడులకతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరైంది.. రష్యా సైన్యాన్ని ఎదిరించేందుకు చేసిన ప్రమత్నాలు పెద్దగా సాగలేదు.. ఉక్రెయిన్‌ మీద కన్నేస్తే ఊరుకునేది లేదని రష్యాను హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా, ఇతర యూరోప్‌ దేశాల నుంచి ఎలాంటి సాయం అందలేదు.. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ రష్యా దూకుడును తప్పుపడుతూనే ఉన్నాయి..

  • 24 Feb 2022 10:07 PM (IST)

    పుతిన్‌ని నియంతగా ప్రకటించిన బ్రిటన్‌

    బ్రిటన్‌ ప్రభుత్వం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని నియంతగా ప్రకటించింది. కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నామంది. దీంతో రష్యా స్టాక్‌ మార్కెట్లు 45శాతం కుప్పకూలాయి. ఇక ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ ఉక్రెయిన్‌కి మద్దతు ప్రకటించారు. రష్యా చర్యలను టర్కీ ముక్తకంఠంతో ఖండించింది.

  • 24 Feb 2022 08:54 PM (IST)

    పుతిన్​తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడే ఛాన్స్..

    ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యకు దిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి పుతిన్​తో మోదీ చర్చలు జరిపనున్నారని చెప్పాయి.

  • 24 Feb 2022 07:50 PM (IST)

    తగ్గేదే లే.. అంటున్న పుతిన్.. తిప్పికొడుతున్నామంటున్న ఉక్రెయిన్

    ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తగ్గేదే లే అంటున్నాడు. ఉక్రెయిన్‌పై రెండో విడత దాడులు ప్రారంభించింది రష్యా . ఈ దాడుల్లో భారీ ఆస్తినష్టం , ప్రాణనష్టం జరిగింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లోని కీలక రక్షణశాఖ , సైనిక కార్యాలయాపై రష్యా ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లు బాంబుల వర్షం కురిపించాయి. అయితే రష్యా దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఇప్పటివరకు 10 రష్యా యుద్దవిమానాలను , హెలికాప్టర్లను కూల్చేసినట్టు తెలిపింది. అయితే తాము ఒక్క యుద్ద విమానాన్ని కూడా కోల్పోలేదని ఉక్రెయిన్‌ కాకమ్మ కబుర్లు చెబుతోందని రష్యా కౌంటరిచ్చింది. ఉక్రెయిన్‌పై ఇస్కంధర్‌ బాలిస్టిక్‌ క్షిపణిలతో మెరుపుదాడులు చేసింది.

  • 24 Feb 2022 07:45 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ రష్యా హస్తగతం – కీలక ప్రకటన చేసిన రష్యా

    రష్యా క్లెయిమ్‌ చేసుకుంది. తాము ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకున్నట్లుగా వెల్లడించింది. అంతకుముందు 300 మంది ఉక్రెయిన్‌ సైనికులు హతం చేసినట్లుగా వెల్లడించింది. కీవ్ నగరంతోపాటు ఒడోసా పోర్టును కూడా చేజిక్కించుకున్నట్లుగా వెల్లడించింది. ఉక్రెయిన్ ఆర్మీకి చెందిన ఆర్టిలరీ పార్క్‌‌కు తమ సైన్యం స్వాధీనం చేసుకుదని వెల్లడిండిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది.

  • 24 Feb 2022 07:40 PM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారి కోసం బీజేపీ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌

    ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగువారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. అందుకోసం ఇప్పటికే పార్టీ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. ఉక్రెయిన్‌లో తెలంగాణవారితో సహా చిక్కుకున్న భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు బండి సంజయ్‌.

  • 24 Feb 2022 07:32 PM (IST)

    Russia-Ukraine War: రష్యా సైనిక విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ ఆర్మీ..

    రష్యా జరుపుతున్న దాడులను తిప్పికొడుతోంది ఉక్రెయిన్. తమ భూభాగంలో దాడులకు పాల్పడితే ఓ రష్యా సైనిక విమానాన్ని ఉక్రెయిన్ సైనికులు కూల్చేశారు. ఈ ఘటనలో 10 మంది రష్యా సైనికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది.

  • 24 Feb 2022 07:21 PM (IST)

    Russia-Ukraine War: ఉదయం నుంచి ఇప్పటి వరకు 203 దాడులు.. CCTV దృశ్యాలు..

    గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాడులు చేస్తూనే ఉంది.  తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు 203 దాడులు జరిగాయి. అదే సమయంలో ఉక్రెయిన్‌కు చెందిన బోర్డర్ గార్డ్ కమిటీ క్రిమియాలోని సరిహద్దు పోస్ట్‌ను దాటుతున్న రష్యా సైనిక సామగ్రి CCTV చిత్రాలను విడుదల చేసింది.

  • 24 Feb 2022 06:45 PM (IST)

    Russia-Ukraine War: స్వయంగా యుద్ధరంగంలోకి సైనికుడిగా దిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

    ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వయంగా యుద్ధానికి చేరుకున్నారు. రష్యా బలగాలు దాడులు చేసిన ప్రాంతాలను అధ్యక్షుడు సందర్శిస్తున్నారు. జెలెన్స్కీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో సైనికుడిగా కనిపిస్తున్నాడు.

    Ukrainian President

    Ukrainian President

  • 24 Feb 2022 05:57 PM (IST)

    18,000 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం- భారత్

    ఉక్రెయిన్ నుండి విద్యార్థులతో సహా సుమారు 18,000 మంది భారతీయులను వెనక్కి తీసుకురావడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది కేంద్ర మంత్రి వీ మురళీధరన్. ఉక్రెయిన్‌లోని గగనతలం మూసివేయబడినందున, భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భారతీయులందరికీ కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందన్నారు. ఈ వివరాలను విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు.

  • 24 Feb 2022 05:54 PM (IST)

    భారత పౌరులను తీసుకురావడానికి రెడీ ఉన్నాం- కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులతో సహా మన పౌరులను తిరిగి తీసుకురావడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శాంతిని కొనసాగించాలని, యుద్ధానికి దారితీసే పరిస్థితి రాకూడదని భారత్ కోరుకుంటోందని అన్నారు.

  • 24 Feb 2022 05:46 PM (IST)

    Russia-Ukraine War: ఇది ప్రజాస్వామ్యాంపై దాడి – బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    తాము ఉక్రెయిన్‌తో ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రష్యా చర్య అనాగరికం అంటూ విమర్శించారు. ఇది ఉక్రెయిన్‌పైనే కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి అండూ మండి పడ్డారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని హామి ఇచ్చారు.  

  • 24 Feb 2022 05:42 PM (IST)

    బలగాలను వెనక్కి రప్పించండి.. రష్యాకు నాటో సూచన

    ఉక్రెయిన్​పై రష్యా చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండించింది నాటో. వెంటనే సైనిక చర్యను ఆపి.. ఉక్రెయిన్​ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను సూచించారు నాటో సెక్రెటరీ జనరల్​ జెన్స్​ స్టోల్టెంన్​బెర్గ్​. నిరంకుశత్వం కంటే ప్రజాస్వామ్యం, అణచివేతపై స్వేచ్ఛ ఎల్లప్పుడూ బలంగా ఉంటుందంటూ హితవు పలికారు.

  • 24 Feb 2022 05:38 PM (IST)

    Russia-Ukraine War: కివీలోని భారత రాయబార కార్యాలయం తెరిచే ఉంటుంది – భారత రాయబారి

    ఉక్రెయిన్​లో పరిస్థితిలు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయని.. ఇది చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు ఉక్రెయిన్​లోని భారత రాయబారి. వాయు స్థావరాలు మూసివేశారని, రైల్వేలు నడిచే పరిస్థితులు కనిపించటం లేదని, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్​ నిలిచిపోయినట్లు అన్నారు. ఉక్రెయిన్​లోని పౌరులు శాంతియుతంగా ఉండాలని.. పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. కివీలోని భారత రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​లోని భారత సంతతి ప్రజలను కలిసి.. భారతీయులకు సాయంగా నిలవాలని కోరినట్లు చెప్పారు రాయబారి.

  • 24 Feb 2022 05:16 PM (IST)

    Russia-Ukraine War: కీవ్‌లో రహదారులు భారీగా ట్రాఫిక్‌ జామ్

    శాంతి ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా వార్నింగులు పనిచేయలేదు. ప్రపంచదేశాల విజ్ఞప్తులు పెడచెవిన పెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన యుధ్దోన్మాదాన్ని ప్రదర్శించారు. గురువారం తెల్లవారుజూమునే ఉక్రెయిన్‌ నగరాల్లో బాంబుల వర్షం కురిపించారు. దీంతో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో రహదారులు ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఆ దృశ్యాలు ఇక్కడ చూడండి..

  • 24 Feb 2022 05:10 PM (IST)

    Russia-Ukraine War: 105 డాలర్లకు చేరిన ముడి చమురు ధర..

    రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం క్రూడ్ అయిల్ ధరలపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఉదయం 101 డాలర్లుగా ఉన్న ధర తాజాగా 105 డాలర్లకు చేరింది.

  • 24 Feb 2022 05:07 PM (IST)

    Russia-Ukraine War: యుద్ధంపై కేంద్రం ఫోకస్‌.. ఆర్థికమంత్రితో ప్రధాని మోడీ సమావేశం..

    రష్యా – ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. కాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. భారత్‌పై పడే ఆర్థిక ప్రభావంపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. పెరిగిన క్రూడాయిల్‌ ధరల ప్రభావాన్ని తగ్గించడంపై కేంద్రం దృష్టి పెట్టింది.

  • 24 Feb 2022 05:03 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో వినాశనం తప్పదు- ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

    ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో వినాశనం తప్పదంటున్నారు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ఈ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమంటున్నారు. సోవియట్‌ యూనియన్‌లో పట్టుకోసమే రష్యా యుద్ధానికి దిగిందటున్నారు ఉత్తమ్‌. ఇప్పటికైతే న్యూక్లియర్‌ వార్‌కు అవకాశం లేదంటున్నారు.

  • 24 Feb 2022 05:01 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపై బాంబు దాడి

    రష్యా దూకుడు మరింత పెంచింది. ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేస్తోంది. తాజాగా కీవ్‌లోని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపై బాంబు దాడి చేసింది.. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడచ్చు.

  • 24 Feb 2022 04:51 PM (IST)

    Russia-Ukraine War: సాధ్యమైనంత త్వరగా నాటో శిఖరాగ్ర సమావేశం -ఫ్రెంచ్ అధ్యక్షుడు

    రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందించారు. సాధ్యమైనంత త్వరగా నాటో శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

  • 24 Feb 2022 04:26 PM (IST)

    Russia-Ukraine War: మాల్‌వేర్‌ దాడితో తుడిచిపెట్టుకుపోయిన ఉక్రెయిన్‌ డేటా

    రష్యా సైనిక చర్యతో సతమతమవుతోంది ఉక్రెయిన్‌. రష్యా ఎటాక్‌తో ఉక్రెయిన్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పార్లమెంట్‌, బ్యాంకులు, షాపింగ్‌ మాల్స్‌.. ఇలా ఒక్కటేమిటి వాణిజ్య, వర్తక సముదాయాలన్నీ మూతపడ్డాయి. మరోవైపు.. మాల్‌వేర్‌ దాడితో ఉక్రెయిన్‌ డేటా తుడిచిపెట్టుకుపోతోంది.

  • 24 Feb 2022 04:25 PM (IST)

    Russia-Ukraine War: వెనక్కి తగ్గినట్టే తగ్గిన రష్యా గోడకు కొట్టిన బంతిలా రివర్స్‌ ఎటాక్‌

    వెనక్కి తగ్గినట్టే తగ్గిన రష్యా గోడకు కొట్టిన బంతిలా రివర్స్‌ ఎటాక్‌కు దిగింది. బలగాల్ని ఉక్రెయిన్‌ వైపు నడిపిన పుతిన్‌.. తర్వాత కాస్త బ్యాక్‌స్టెప్‌ వేశారు. ఇక.. యుద్ధం ముగిసినట్టేనని అంతా భావించారు. తగ్గినట్టే కనిపించిన రష్యా.. ఉక్రెయిన్‌కు ఊహించని షాక్‌ ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినట్టుగానే.. ఉక్రెయిన్‌పై దాడికి దిగింది రష్యా.

  • 24 Feb 2022 04:25 PM (IST)

    Russia-Ukraine War: కన్నీళ్లు పెట్టుకుంటున్న ఉక్రెయిన్‌

    ఉక్రెయిన్‌ కన్నీళ్లు పెడుతోంది. ఊహించని ఉత్పాతంతో ఉక్కపోతకు గురవుతోంది. ఎటుచూసినా యుద్ధ భయంతో భీతిల్లిపోతున్నారు ఉక్రెయిన్‌ వాసులు. రష్యా దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతుండడం ప్రపంచాన్ని కలిచివేస్తోంది. నివాస ప్రాంతాలపై మెరుపు దాడులు కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోవడం కంటతడి పెట్టిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారులు దిక్కులేని వారిగా మిగిలిపోతున్నారు

  • 24 Feb 2022 04:10 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థులు..

    రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. దీంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఉక్రెయిన్‌లో బోధన్‌కు చెందిన విద్యార్థి ముప్పారాజు వినయ్ ఉన్నారు. వినయ్, ఎంబీబీఎస్ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బోధన్‌కు చెందిన నరేందర్, సంధ్యా రాణి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్దకొడుకు వినయ్ ఎంబిబిఎస్ చదవడం కోసం 2019లో ఉక్రెయిన్‌కు వెళ్లాడు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులతో, తీవ్ర ఆందోళన చెందుతున్నారు వినయ్‌ పేరేంట్స్‌.

  • 24 Feb 2022 04:10 PM (IST)

    Russia-Ukraine War: రష్యా వార్‌ దెబ్బకు క్రిప్టో కరెన్సీ ఢమాల్‌

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుండటంతో అన్ని మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. తాజాగా క్రిప్టో కరెన్సీపై కూడా ఆ ప్రభావం పడింది. తారాజువ్వలా దూసుకుపోతున్న బిట్ కాయిన్ కూడా పడిపోయింది. ఏకంగా 35వేల డాలర్లకు పడిపోయింది బిట్‌కాయిన్‌. ఒక్కరోజులో 10శాతం పతనమైంది. అమెరికా ఆంక్షలతో క్రిప్టో కరెన్సీపై రష్యా ఆధారపడే అవకాశం తగ్గిపోయింది.

  • 24 Feb 2022 03:55 PM (IST)

    Russia-Ukraine War: 101 డాలర్ల రికార్డు స్థాయికి చేరిన ముడి చమురు బ్యారెల్‌ ధర

    దేశప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 101 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరడం ఇదే తొలిసారి. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం పూర్తిగా చెలరేగితే ముడి చమురు మరింత ఖరీదైనది. 

  • 24 Feb 2022 03:52 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి వార్తల కారణంగా..

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి వార్తల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1935 డాలర్లు దాటింది. దీంతో భారతీయ మార్కెట్లలో MCX లో బంగారం ధరలు గ్రాముకు 1400 రూపాయలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర 51,750 రూపాయలు దాటింది. వాస్తవానికి, ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీని కారణంగా బంగారంను కూడా తాకలేదు.

  • 24 Feb 2022 03:44 PM (IST)

    Russia-Ukraine War: రష్యా వార్‌తో పైపైకి బంగారం ధరలు.. క్షణాల్లో +1597 జంప్..

    రష్యా- ఉక్రెయిన్ వార్‌తో ఓ వైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలితే.. మరో వైపు బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.  MCXలో బంగారం ధర రూ.51,976 (+1597) చేరింది. MXCలో కిలో వెండి ధర రూ.67,067 (+2462) కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో 1952 డాలర్లకు చేరిన ఔన్స్‌ బంగారం ధర ప్రస్తుతం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

  • 24 Feb 2022 03:40 PM (IST)

    Russia-Ukraine War: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు..

    రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో దారుణంగా కుప్పకూలిన భారత స్టాక్‌మార్కెట్లు.. ఉదయం నుంచే నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు నష్టాలతోనే ముగించాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. పుతిన్‌ ఇచ్చిన షాక్‌తో ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం ఏర్పడింది.

    సెన్సెక్స్‌ నష్టం 2792 పాయింట్లు

    క్లోజింగ్‌ 54,439 పాయింట్లు

    నిఫ్టీ నష్టం 847 పాయింట్లు

    క్లోజింగ్‌ 16,216 పాయింట్లు

  • 24 Feb 2022 03:35 PM (IST)

    Russia-Ukraine War: రష్యా జరుపుతున్న దాడులకు లొంగేది లేదు.. – ఉక్రెయిన్ అధ్యక్షుడు

    రష్యా దాడులకు లొంగిపోదని లేదని తేల్చి చెప్పారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ. మేము రష్యా ముందు తలవంచేది లేదని పేర్కొన్నారు. రష్యా జరుపుతున్న దాడులను ధీటుగా తమ సైన్యం సమాధానం ఇస్తోందని అన్నారు.

  • 24 Feb 2022 03:31 PM (IST)

    Russia-Ukraine War: రష్యా దాడులను తిప్పికొడుతున్నాం- ఉక్రెయిన్

    రష్యా జరుపుతున్న దాడులను తిప్పికొడుతున్నామని ప్రకటించింది ఉక్రెయిన్. ఇప్పటికే ఐదుగురు రష్యా సైనికులను చంపేసినట్లుగా ప్రకటించుకుంది. అయితే తాజాగా రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేసినట్లుగా వెల్లడించింది.

  • 24 Feb 2022 03:23 PM (IST)

    Russia-Ukraine War: ప్రస్తుతం యుద్ధ విమానాలు ఇలా..

    ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. ఇది యుద్ధం కాదు.. కేవలం సైనిక చర్య అంటోంది. అక్కడి యుద్ధ విమానాలు ఇప్పుడు నేల పైన లేవు.. వందల సంఖ్యలో గాలిలోనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఓ చాయాచిత్రంను రష్యా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని రష్యా రాడార్ అందించింది.

  • 24 Feb 2022 03:18 PM (IST)

    Russia Ukraine War: ఇలాంటి పరిస్థితి ఊహించలేదంటున్న భారతీయ విద్యార్థులు

    ఉక్రెయిన్‌లో తాము ఇలాంటి పరిస్థితి ఊహించలేదంటున్న విద్యార్థులు.. తమ ఇళ్లకు చేరేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • 24 Feb 2022 03:13 PM (IST)

    Russia Ukraine War: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు కీలక సూచన..

    ఉక్రెయిన్‌ సంక్షోభంపై కీవ్‌ లోని భారత దౌత్యకార్యాలయం కీలక అడ్వయిజరీ విడుదల చేసింది. భారతీయ విద్యార్ధులు ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని , ఇళ్లు , హాస్టళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. రాజధాని కీవ్‌లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని , అందుకే పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కూడా సూచించింది.

  • 24 Feb 2022 02:56 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త..

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త. భారత ప్రభుత్వం విమాన మార్గంలో భారత్‌కు తీసుకొచ్చే పరిస్థితులు తగ్గిపోతుండటంతో.. మరో ప్రయత్నం మొదలు పెట్టింది భారత్.  భారతీయులందరూ పశ్చిమ ఉక్రెయిన్‌కు చేరుకోవాలని కోరింది. ప్రస్తుతం విమాన మార్గం సాధ్యం కాదు. తూర్పున రష్యా, ఉత్తరాన బెలారస్, దక్షిణాన నల్ల సముద్రం సమీపంలో భారీగా యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి.

  • 24 Feb 2022 02:52 PM (IST)

    Russia-Ukraine War: యుద్ధం మొదలైందని ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌

    యుద్ధం మొదలైందని కీలక ప్రకటన చేశారు రష్యా అధ్యక్షుడు  పుతిన్ ప్రకటన చేశారు.

  • 24 Feb 2022 02:36 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా వ్యూహాత్మకం..

    ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరించిందా? ప్రత్యర్థి ఊపిరిపీల్చుకోకుండా ప్లాన్ చేసి దాడి చేసిందా? అంటే అవునని అంటున్నారు నిపుణులు. యుద్ధంలో మొదట ఎయిర్‌ పవర్‌ను వాడుతారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ యుద్ధసామాగ్రిపై దాడి చేసింది రష్యా. తమ యుద్ధ విమానాలకు బదులివ్వకుండా అటాక్‌కు పాల్పడింది. ముందు ఎయిర్‌ బేస్‌లను టార్గెట్ చేసింది రష్యా.

  • 24 Feb 2022 02:30 PM (IST)

    Russia-Ukraine War: మోడీ జీ..! రష్యాకు మీరే చెప్పండి.. – ఉక్రెయిన్‌

    ఉక్రెయిన్‌పై రష్యా నిరంతరంగా బాంబు దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై క్షిపణులతో దాడికి దిగింది. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరింది. ఉక్రెయిన్ రాయబారి భారత్ జోక్యాన్ని కోరింది. ఈ మొత్తం విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. భారత్-రష్యా సంబంధాలను ఉదహరించింది.   

  • 24 Feb 2022 02:20 PM (IST)

    Russia-Ukraine War: నిత్యావసర వస్తువుల కోసం సూపర్‌మార్కెట్లకు జనం పరుగులు

    రష్యా దాడితో ఉక్రెయిన్‌లో అల్లకల్లోలంగా ఉంది. కీవ్‌తో పాటు పలు ప్రాంతాల్లో రోడ్ల పైకి వచ్చిన జనం.. నిత్యావసర వస్తువుల కోసం సూపర్‌మార్కెట్లకు పరుగులు పెడుతున్నారు.. దీంతో అక్కడ విపరీతమైన రద్దీగా ఉంది. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి జనం ఎగబడుతున్నారు.

  • 24 Feb 2022 02:18 PM (IST)

    Russia-Ukraine War: రష్యా దాడిలో 300 మంది ప్రాణాలు కోల్పోయిన ఉక్రెయిన్‌ వాసులు

    ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కొన్ని దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. రోడ్డు మీద సైకల్‌ పై వస్తున్న బాలిక బాంబ్ దాడికి బలైపోయింది. ఏం జరుగుతుందో తెలియకుండా వస్తున్న బాలిక బాంబ్‌కు బలైపోయింది. ఆ సమయంలో ఆమె విలవిలలాడిపోయింది. బాంబ్‌ పేలిన అనంతరం ఆమె శరీరభాగాలు చెల్లాచెదురయ్యాయి.

  • 24 Feb 2022 02:13 PM (IST)

    Russia-Ukraine War: రష్యా సైనిక చర్యను ఖండించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు

    ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం తీవ్రంగా ఖండించారు. యుద్ధాన్ని ముగించేందుకు మిత్రదేశాలతో కలిసి ఫ్రాన్స్ పని చేస్తుందని అన్నారు. రష్యా తన సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  • 24 Feb 2022 02:11 PM (IST)

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోకి చొచ్చుకుపోయిన రష్యా సైన్యం

    టీవీ9 ఉక్రెయిన్‌ నుంచి అందిస్తున్న నివేదిక ప్రకారం.. రష్యా సైన్యం కూడా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు రష్యా మరింత దూకుడుగా దాడి చేస్తోంది.

  • 24 Feb 2022 02:09 PM (IST)

    రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తత.. ఆస్ట్రేలియా ఆంక్షలను మరింత పెంచింది..

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఆస్ట్రేలియా గురువారం రష్యాపై రెండవ ఆంక్షల జాబితాను విడుదల చేసింది. రెండో దశలో పలు ఆంక్షలు విధించారు. 

  • 24 Feb 2022 02:02 PM (IST)

    భయాందోళనల్లో జనం

    ఉక్రెయిన్‌లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.. పెద్ద ఎత్తున జనం నగరాలను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు.

    Ukraine

    Ukraine

  • 24 Feb 2022 01:58 PM (IST)

    రష్యా షెల్లింగ్‌లో ఏడుగురు మృతి

    రష్యా షెల్లింగ్‌లో కనీసం ఏడుగురు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.

  • 24 Feb 2022 01:52 PM (IST)

    వెనక్కి తగ్గుతున్న ఉక్రెయిన్ సైనికులు: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ

    రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. దీంతో సైనిక విభాగాల్లోని సైనికులు ఎక్కువగా తమ స్థానాలను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.వారి ఆయుధాలను విసిరినట్లు నిఘా డేటా చూపించిందని పేర్కొంది. తమ ఆయుధాలను ఉంచిన ఉక్రెయిన్ సైన్యం యూనిట్ల స్థితి దాడులకు నష్టపోయినట్లు వెల్లడించింది.

  • 24 Feb 2022 12:53 PM (IST)

    రష్యా దాడి చాలా సంతోషాన్ని కలిగించిందిః ఇమ్రాన్ ఖాన్

    పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తన యుద్దోన్మాదాన్ని చాటుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చిందని ఉక్రెయిన్‌పై రష్యా దాడిని సమర్ధించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు ఇమ్రాన్‌. ప్రస్తుతం పాక్‌ ప్రధాని రష్యా పర్యటన లోనే ఉన్నారు.

  • 24 Feb 2022 12:50 PM (IST)

    ఇప్పటికైనా లొంగిపోతే మంచిదిః పుతిన్

    ఉక్రెయిన్‌పై దాడిని పూర్తిగా సమర్ధించుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. ఇప్పటికైనా ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోతే మంచివదని సలహా ఇచ్చారు. నాటో బలగాలు ఉక్రెయిన్‌కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

  • 24 Feb 2022 12:49 PM (IST)

    భారత దౌత్యకార్యాలయం కీలక ఆదేశాలు

    ఉక్రెయిన్‌ సంక్షోభంపై కీవ్‌ లోని భారత దౌత్యకార్యాలయం కీలక అడ్వయిజరీ విడుదల చేసింది. భారతీయ విద్యార్ధులు ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని , ఇళ్లు , హాస్టళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. రాజధాని కీవ్‌లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని , అందుకే పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కూడా సూచించింది.

  • 24 Feb 2022 12:47 PM (IST)

    మొదలైన ప్రాణ నష్టం

    రష్యా దాడితో ఉక్రెయిన్‌ విలవిలలాడుతోంది. కైవ్‌లోని బ్రోవరీలో ఒకరు మరణించారని, ఒకరు గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • 24 Feb 2022 12:44 PM (IST)

    బెలారస్ నుండి కూడా దాడి: ఉక్రెయిన్

    పొరుగున ఉన్న బెలారస్ నుండి రష్యా దళాలు దేశంపై దాడి చేశాయని ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీ తెలిపింది. రష్యా దళాలు బెలారస్ నుండి ఫిరంగులను ప్రయోగించాయని ఏజెన్సీ తెలిపింది. ఉక్రెయిన్ సైనికులు కూడా ప్రతీకార కాల్పులు జరుపుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదిక లేదని కూడా చెప్పారు. రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌కు సైనిక విన్యాసాల కోసం సైన్యాన్ని పంపింది.

  • 24 Feb 2022 12:40 PM (IST)

    ATM వద్ద క్యూ కట్టిన జనం

    రష్యా దాడితో ఉక్రెయిన్‌లో అలజడి మొదలైంది. ఇప్పటికే రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఒకవైపు జనంలో ఆందోళన మొదలైంది. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మారియుపోల్‌లోని ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు.

    Atm

    Atm

  • 24 Feb 2022 12:35 PM (IST)

    24×7 కంట్రోల్ రూం ఏర్పాటు

    ఉక్రెయిన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతీయుల, ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై దృష్టి కేంద్రీకరించమని తెలిపారు. MEA కంట్రోల్ రూం 24×7 ప్రాతిపదికన విస్తరించినట్లు తెలిపింది. అత్యవసర సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

  • 24 Feb 2022 12:32 PM (IST)

    ఉక్రెయిన్‌పై దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

    “మానవత్వం పేరుతో, శతాబ్దం ప్రారంభం నుండి అత్యంత ఘోరమైన యుద్ధాన్ని ఐరోపాలో ప్రారంభించడానికి అనుమతించవద్దు” అని UN చీఫ్ గుటెర్రెస్ పేర్కొన్నారు.

  • 24 Feb 2022 12:29 PM (IST)

    ఐదు రష్యన్ విమానాలు కూల్చివేత

    ఐదు రష్యన్ విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

  • 24 Feb 2022 12:27 PM (IST)

    సంఘీభావం తెలిపిన జర్మనీ

    జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద ఉక్రెయిన్ జెండాతో సంఘీభావం ప్రదర్శించారు.

  • 24 Feb 2022 12:26 PM (IST)

    రంగంలోకి అమెరికా బాంబర్లు

    ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి చేస్తోంది. మరోవైపు యూరప్‌లోని ఓ అజ్ఞాత ప్రదేశానికి అమెరికా బాంబర్లు వెళ్లిపోయాయి.

    Us Bombers

    Us Bombers

  • 24 Feb 2022 12:17 PM (IST)

    ఉక్రెయిన్ నేషనల్ గార్డ్స్ హెడ్ క్వార్టర్స్ ధ్వంస

    ఉక్రేనియన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయాన్ని తాము ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ సైన్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

  • 24 Feb 2022 12:15 PM (IST)

    విమానాశ్రయంపై బాంబు దాడి

    రష్యా దాడితో ఉక్రెయిన్‌లో విధ్వంసం కొనసాగుతోంది. ఇవానో – ఫ్రాంక్విస్క్‌లోని విమానాశ్రయం బాంబు దాడి దృశ్యాలు.

  • 24 Feb 2022 12:12 PM (IST)

    నాటో అత్యవసర సమావేశం

    రష్యా దాడితో ఉక్రెయిన్‌లో భారీగాద నష్టం కొనసాగుతుందని నివేదికల మధ్య నాటో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత నాటో రష్యాపై గట్టి చర్యకు సిద్ధమైంది. నివేదిక ప్రకారం, నాటోలోని 30 సభ్య దేశాల నుండి రష్యాపై దాడి చేసే చర్చ జరుగుతోంది. నాటో రష్యాకు వ్యతిరేకంగా ఆర్టికల్-4ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది

  • 24 Feb 2022 12:06 PM (IST)

    ఎయిర్‌బేస్‌లు, ఎయిర్ డిఫెన్స్‌ ధ్వంసం

    ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లు, ఎయిర్ డిఫెన్స్‌లను రష్యా సైన్యం ధ్వంసం చేసిందని” AFP తెలిపింది.

  • 24 Feb 2022 11:50 AM (IST)

    భారత్ వైఖరి తటస్థంః ఆర్‌కే రంజన్ సింగ్

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి భారతదేశం స్పందించింది. ఈ విషయంలో భారత్ వైఖరి తటస్థంగా ఉందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ స్పష్టం చేశారు. శాంతియుతంగా ఇరు దేశాలు సమస్యలను పరిష్కారించుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు.

  • 24 Feb 2022 11:24 AM (IST)

    దక్షిణ రష్యా నగరాల నుండి విమానాలు రద్దు

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన తర్వాత దక్షిణ రష్యాలోని నగరాలకు బయలుదేరే అన్ని విమానాలు గురువారం రద్దు చేశారు. విమానాలు రద్దు చేయబడిన నగరాలలో క్రాస్నోడార్, సోచి, అనపా ఉన్నాయి.

  • 24 Feb 2022 11:23 AM (IST)

    ఉక్రెయిన్ అధ్యక్షుడికి జో బిడెన్ ఫోన్

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీనికి సంబంధించి త్వరలో మిత్ర దేశాలతో సమావేశం నిర్వహించనున్నట్టు కూడా చెప్పారు.

  • 24 Feb 2022 11:21 AM (IST)

    పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంః భారత్

    రష్యా-ఉక్రెయిన్ పరిస్థితి పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని UNSCలో భారత్ అభిప్రాయపడింది..

  • 24 Feb 2022 11:20 AM (IST)

    మిత్రదేశాలతో కలిసి నిర్ణయాత్మక నిర్ణయంః యూకే

    ఉక్రెయిన్‌లో సైనిక చర్యను పుతిన్ ప్రకటించిన తర్వాత UK స్పందించింది. మిత్రదేశాలతో చర్చించి, నిర్ణయాత్మకంగా స్పందిస్తామని బోరిస్ జాన్సన్ చెప్పారు.

  • 24 Feb 2022 11:17 AM (IST)

    భద్రతా మండలిలో ఖండన తీర్మానం

    ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి లిండా థామస్ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాను ఖండిస్తూ తీర్మానం చేస్తానని చెప్పారు. ఈ విషయంలో మండలి ఏదో ఒకటి చేయాలని అన్నారు. తీర్మానాన్ని రేపు ప్రతిపాదిస్తామని తెలిపారు.

  • 24 Feb 2022 11:15 AM (IST)

    ఖండించిన NATO చీఫ్

    రష్యా దాడిపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తీవ్రంగా ఖండించారు. ఇది అనవసరమైన దాడి అని ఆయన అన్నారు. దీని వల్ల లెక్కలేనంత మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా నిర్లక్ష్యపూరితమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, హెచ్చరికలు చేసినా.. రష్యా దూకుడు మార్గాన్ని ఎంచుకుందని ఆయన అన్నారు.

  • 24 Feb 2022 11:09 AM (IST)

    నౌకాదళానికి భారీ నష్టం

    రష్యా దాడి వల్ల ఆ దేశ నౌకాదళానికి గణనీయమైన నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. కీవ్, ఖార్కివ్‌లోని ఉక్రేనియన్ మిలిటరీ కమాండ్ పోస్టులు.. క్షిపణి, రాకెట్ దాడులతో ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

  • 24 Feb 2022 11:02 AM (IST)

    వెనక్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం

    రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ ముందుజాగ్రత్తగా అన్ని పౌర విమానాలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని కైవ్‌లో ఎయిర్ మిషన్‌లకు నోటీసు (NOTAM) కారణంగా ఎయిర్ ఇండియా విమానం AI1947 తిరిగి ఢిల్లీకి వస్తోంది.

  • 24 Feb 2022 10:56 AM (IST)

    ఉక్రెయిన్‌పై క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం

    బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో కీవ్‌లోని పలు ప్రాంతాలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లోని శాంతియుత నగరాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుని గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచం వెంటనే స్పందించాలన్న ఆయన రష్యాపై వినాశకరమైన, వేగవంతమైన ఆంక్షలు విధించాలని కోరారు. రష్యాను అన్ని విధాలుగా, అన్ని ఫార్మాట్లలో పూర్తిగా వేరు చేయాలన్నారు. ఉక్రెయిన్ కోసం ఆయుధాలు, పరికరాలు. ఆర్థిక, మానవతా సహాయం అందించాలన్నారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి.

  • 24 Feb 2022 10:55 AM (IST)

    ఉక్రెయిన్‌లోని 11 నగరాలపై ఏకకాలంలో దాడి

    రష్యా యుద్ధం ప్రకటించిన వెంటనే ఉక్రెయిన్‌లోని 11 నగరాలపై ఏకకాలంలో దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని నగరాలు లక్ష్యంగా చేసుకున్నాయి.

  • 24 Feb 2022 10:53 AM (IST)

    అమెరికా ఏం చెప్పింది

    ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. ఈ దాడి వల్ల జరిగే ప్రతి మరణానికి రష్యా బాధ్యత వహిస్తుందని ఆయన అన్నారు. అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి త్వరలో ఒక ప్రణాళిక వేస్తాయన్నారు. రష్యాకు సరియైన సమాధానం ఇస్తామన్నారు. G7 సహచరులతో చర్చలు జరిపి, NATO మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటామన్నారు.

  • 24 Feb 2022 10:39 AM (IST)

    క్రెమ్‌టోర్స్క్ , ఒడెస్సాలో పేలుళ్లు

    ఉక్రెయిన్ సరిహద్దు దగ్గర రష్యా దాదాపు 2 లక్షల మంది సైనికులను మోహరించింది. ఇక్కడ, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అనేక పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని మూడో అతిపెద్ద నగరమైన క్రెమ్‌టోర్స్క్ , ఒడెస్సాలో పేలుడు శబ్దం వినిపిస్తోంది.

  • 24 Feb 2022 10:38 AM (IST)

    ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఆదేశం

    AFP ప్రకారం, పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఆదేశించారు. ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించే ఉద్దేశం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. కానీ బయటి నుంచి ఏదైనా ముప్పు ఏర్పడితే తక్షణమే స్పందిస్తామన్నారు.

  • 24 Feb 2022 10:36 AM (IST)

    మొదలైన బాంబుల మోత

    ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల మధ్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యకు ఆదేశించారు. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వదులుకోవాలని పుతిన్ అన్నారు. దీని తర్వాత ఉక్రెయిన్‌లోని వివిధ నగరాల్లో పేలుళ్లు జరిగాయి.

  • 24 Feb 2022 10:35 AM (IST)

    ఉన్నపళంగా దాడికి తెగబడ్డ రష్యా

    ఉన్నపళంగా దాడికి తెగబడ్డ రష్యా.. ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. మూడు వైపుల నుంచి దాడి చేసి.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. ఏ వ్యవస్థ పనిచేయాలన్నా.. విద్యుత్ అంత్యంత ముఖ్యం. ఆ వ్యవస్థను కొలాప్స్ అయ్యేలా దాడులకు తెగపడింది రష్యా. ఆ తర్వాత దాడులపై ఎదురుదాడి చేయాలంటే ఎయిర్‌పోర్ట్‌లు, ఎయిర్‌బేస్‌లు చాలా కీలకం. ఏకంగా 11 నగరాల్లో.. ఆయా కేంద్రాలను సెర్చ్ చేసి అటాక్ చేసింది రష్యా.

  • 24 Feb 2022 10:34 AM (IST)

    ఉక్రెయిన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రష్యా

    అర్ధరాత్రి సమయంలో ఉన్నపళంగా దాడికి దిగిన రష్యా.. ఉక్రెయిన్ ఊపిరిపీల్చుకోకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ బేస్‌లపై దాడి, ఎయిర్‌పోర్ట్‌లపై అటాక్, విద్యుత్ వ్యవస్థపై దాడి.. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా ప్రణాళికతో దాడికి దిగినట్లు అర్థం అవుతుంది. కీ జోన్స్‌పై దాడి చేసి.. ఎదురుదాడి చేయకుండా పక్కాగా ప్రణాళిక రచించినట్లు రష్యా తాజా దాడులు స్పష్టం చేస్తున్నాయి.

  • 24 Feb 2022 10:33 AM (IST)

    ఉద్రిక్త పరిస్థితులు

    ముందు నుంచి అలుముకున్న యుద్ధమేఘాలు యాక్షన్‌లోకి వచ్చాయి. ముందు నుంచి దూకుడు ప్రదర్శించిన రష్యా.. ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ప్రపంచ దేశాలన్నీ ప్రతిఘటిస్తున్నా.. యుద్ధానికి కాలుదువ్వింది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఒక కాలు వెనక్కి వేసినట్లు కనిపించినా.. ఉక్రెయిన్ ఒక అడుగు ముందుకు వేయడంతో రష్యా రెండడుగులు ముందుకు వేసింది.

Published On - Feb 24,2022 10:06 AM

Follow us
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై