Good News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జీతాలు పెంపు.. భారీ ఇంక్రిమెంట్స్ ఉండే అవకాశం!!

కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే వేతనాలు భారీగా పెరగనున్నాయి. దేశంలోని ప్రముఖ కంపెనీలు...

Good News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జీతాలు పెంపు.. భారీ ఇంక్రిమెంట్స్ ఉండే అవకాశం!!
Salaries
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 04, 2022 | 8:28 AM

కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే వేతనాలు భారీగా పెరగనున్నాయి. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఈసారి మంచిగా ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ అంశంపై డెలాయిట్ వర్క్‌ఫోర్స్ అండ్ వేజ్‌గ్రోత్ ట్రెండ్స్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ ఏడాది ఉద్యోగులకు సుమారు 9.1 శాతం వేతన పెంపు ఉండొచ్చునని సర్వే పేర్కొంటోంది. దాదాపు 34 శాతం కంపెనీలు డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాల్లో శాలరీల పెంపు గరిష్ట స్థాయిలో ఉంటుందని నివేదిక చెబుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా శాలరీలలో పెంపు ఉండొచ్చు.

ముఖ్యంగా జూనియర్ ఎంప్లాయిస్‌కు డబుల్ డిజిట్ శాలరీ హైక్ ఉండనుండగా.. సీనియర్లకు మాత్రం వేతనం పెంపు తక్కువగానే ఉంటుందని సర్వే పేర్కొంది. సహజంగా బాగా పనిచేసేవారు మంచి ఇంక్రిమెంట్స్ ఆశించడం సర్వసాధారణం.. అంతేకాకుండా వచ్చే ఇంక్రిమెంట్ తాను అనుకున్నట్లుగా రాకపోతే వలసలు కచ్చితంగా ఉంటాయి. అందుకే కంపెనీలు అన్ని కూడా ముందే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగత పనితీరు ఆధారంగా బాగా పనిచేసేవారికి భారీగా వేతనాల పెంపు ఇవ్వాలని చూస్తున్నాయి. కాగా, 2021లో 92 శాతం సంస్థలు తమ ఉద్యోగులకు వేతనాలు పెంచగా.. 2020లో కేవలం 60 శాతం కంపెనీలు మాత్రమే శాలరీలు పెంచాయి. ఇక ప్రీ-కోవిడ్ స్టేజీ(8.6 శాతం)లో ఇచ్చిన ఇంక్రిమెంట్స్‌ కంటే.. ఇప్పుడు ఇచ్చే శాలరీ హైక్ 50 బేసిక్ పాయింట్లు అధికంగా ఉంటుందని సుమారు 450 కంపెనీల హెచ్.ఆర్‌లతో చేసిన సర్వేలో స్పష్టమైంది.