Post Office Schemes: కస్టమర్లకు అలర్ట్.. ఈ స్కీమ్‌లకు అకౌంట్ లింక్ చేయలేదా.. ఏప్రిల్ నుంచి డబ్బులు రావు
Post Office Schemes: పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీసు టైమ్..
Post Office Schemes: పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీసు టైమ్ డిపాజిట్స్ (TD) వంటి వాటిల్లో మీరు చేరినట్లయితే కొన్ని విషయాలను గుర్తించుకోవడం తప్పనిసరి. మీరు ఈ స్కీమ్స్‌లలో చేరి ఉంటే మీ పోస్టాఫీసు (Post Office) లేదా బ్యాంక్ అకౌంట్ (Bank Account)ను ఈ పథకాలకు అనుసంధానం చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ స్కీమ్, టైమ్ డిపాజిట్ వంటి స్కీమ్‌లలో చేరిన వారు నెల, మూడు నెలలు, ఏడాది చొప్పున డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారు వారికి నచ్చిన ఆప్షన్ ఎంచుకుని ఉండవచ్చు. అయితే ఈ స్కీమ్‌లలో చేరిన కొంత మంది ఇంకా వారి పోస్టాఫీసు అకౌంట్ లేదా బ్యాంకు అకౌంట్‌ను ఈ స్కీమ్‌తో అనుసంధానం చేసుకోనట్లు గుర్తించిన పోస్టల్ శాఖ.. కస్టమర్లను అలర్ట్ చేసింది. ఏప్రిల్ నుంచి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్, టర్మ్ డిపాజిట్లపై ఆర్జించిన వడ్డీ మొత్తాన్ని ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌తో లింక్ చేసుకున్న పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్, లేదా బ్యాంకు అకౌంట్లతోనే జమ చేస్తామని వెల్లడించింది.
ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ (Sundry Account) ద్వారా క్యాష్ రూపంలో చెల్లింపులు ఉండవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తెలిపింది. ఈ మేరకు ఒక సర్క్యూలర్ జారీ చేసింది. సేవింగ్స్ అకౌంట్‌లో జమ అయిన వడ్డీ డబ్బులను మళ్లీ అదనపు వడ్డీ పొందవచ్చు. ఒక వేళ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, టర్మ్ డిపాజిట్ నుంచి నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి వడ్డీ రాదని తెలిపింది. అయితే వడ్డీ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వినియోగదారులు పోస్టాఫీసుకు రావాల్సిన అవసం లేదు. ఆన్‌లైన్‌లో కూడా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
ఇవి కూడా చదవండి: