- Telugu News Photo Gallery Business photos FlyBig adds Hyderabad, Indore and Gondia to its network under UDAN scheme
UDAN Scheme: ఉడాన్ స్కీమ్ కింద హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు
UDAN Scheme: ఉడాన్ స్కీమ్ కింద మరో విమాన సర్వీసు సేవలు మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ విమాన సర్వీసు (Flight Services).. ఇప్పుడు మరిన్ని ..
Updated on: Mar 04, 2022 | 6:56 AM

UDAN Scheme: ఉడాన్ స్కీమ్ కింద మరో విమాన సర్వీసు సేవలు మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ విమాన సర్వీసు (Flight Services).. ఇప్పుడు మరిన్ని ప్రధాన ప్రాంతాలకు విస్తరించనుంది.

ఉడాన్ స్కీమ్‌లో భాగంగా ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్స్ కంపెనీ హైదరాబాద్‌కు సర్వీసులను ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మహారాష్ట్ర గొండియా మీదుగా హైదరాబాద్‌కు మార్చి 13 నుంచి విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

అయితే ప్రధాన నగరాలతో పాటు టైర్ 20, టైర్ 3 నగరాలను అనుసంధానించడంలో భాగంగా ఈ సర్వీసులను మరింతగా విస్తరించనున్నట్లు సీఎండీ సంజయ్‌క్ష మాండవియా పేర్కొన్నారు. మే 2వ వారంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు చెప్పారు.

మే 2వ వారంలో ఈశాన్య రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభం అవుతాయని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోల్‌కతా, దిబ్రూఘర్, గౌహతి, లిలాబరి, రూప్సీ (అసోం)ఆగర్తల (త్రిపుర), పసిఘాట్, తేజు (అరుణాచల్ ప్రదేశ్)తో సహా నాలుగు రాష్ట్రాలలో ఎనిమిది గమ్యస్థానాలకు 20 సర్వీసులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.





























