IPO News: వాట్సాప్ నుంచి IPOకి అప్లికేషన్ సర్వీస్.. కొత్తగా అందుబాటులోకి.. పూర్తి వివరాలు మీకోసం..
IPO News: గత కొంత కాలంగా దేశంలో స్టాక్ మార్కెట్లలో(Stock Market) పెట్టుబడులు పెట్టడం భారీగా పెరిగింది. ఇందులో ప్రధానంగా ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
IPO News: గత కొంత కాలంగా దేశంలో స్టాక్ మార్కెట్లలో(Stock Market) పెట్టుబడులు పెట్టడం భారీగా పెరిగింది. ఇందులో ప్రధానంగా ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ(Geojit Financial Services) సరికొత్త సర్వీసులను లాంచ్ చేసింది. తమ బ్రోకరేజ్ సంస్థ కస్టమర్లు ఇకపై వాట్సాప్ ద్వారా ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ కంపెనీ. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే అప్లికేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసేందుకు నూతన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చినట్లు జియోజిత్ సంస్థ వెల్లడించింది. ఇది అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ అని కంపెనీ చెబుతోంది.
IPOలో పార్టిసిపేట్ చేయటానికి ఇతర యాప్‌లను వినియోగించాల్సిన అవసరం లేకుండా.. కేవలం వాట్సాప్ ఛాట్ విండో ద్వారా ఏ ఐపీఓనైనా జియోజిత్ కస్టమర్లు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చని కంపెనీ చెప్పింది. ఈ వాట్సాప్ విధానాన్ని జియోజిత్ టెక్నాలజీస్ రూపొందించిందని కంపెనీ పేర్కొంది. ఇది స్టాక్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోందని సంస్థ చెబుతోంది. దీనిని వినియోగించటం ద్వారా కేవలం నిమిషాల్లోనే తమ అప్లికేషన్ ను ఇన్వెస్టర్లు పూర్తి చేయవట్టని స్పష్టం చేసింది.
అయితే కస్టమర్లందరూ వాలిడ్ UPI(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఐడీని లేదా యూపీఐ ఎనేబుల్డ్ మొబైల్ అప్లికేషన్‌ను వాడాల్సి ఉంటుంది. ఎల్ఐసీతో పాటు మరో ఐదు కంపెనీలు త్వరలోనే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కు రానున్నాయి. ఎల్ఐసీ ఐపీఓపై ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఉన్న తరుణంలో వారికి ఈ సౌకర్యం మరింతగా ఉపయోగపడనుంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అనేక కంపెనీలు తమ ఐపీవోల లాంచ్ ను మరికొంత కాలం వాయిదా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎల్ఐసీ విషయంలోనూ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా మార్కెట్లో వస్తున్న వార్తల ప్రకారం కేంద్రం సైతం ఈ విషయంలో కొంత తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి సాంకేతికత జోడించిన సర్వీసుల వల్ల కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లకు మరింత చేరువ అయ్యే అవకాశం పెరగనుంది.
ఇవీ చదవండి..
UDAN Scheme: ఉడాన్ స్కీమ్ కింద హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు