Insurance Riders: ఇన్సూరెన్స్ పాలసీలకు రైడర్లను ఇలా ఎంచుకోండి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇలా పొందండి..
Insurance Riders: మీరు ఇన్సూరెన్స్ పాలసీని(New policy) కొనుగోలు చేయడానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశారా?. ఇన్సూరెన్స్ ఏజెంట్ మీ పాలసీకి రైడర్‌ను జోడించడంలో బిజీగా ఉన్నారా?. అయితే ఈ వివరాలు మీకోసమే..

Insurance Riders: మీరు ఇన్సూరెన్స్ పాలసీని(New policy) కొనుగోలు చేయడానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశారా?. ఇన్సూరెన్స్ ఏజెంట్ మీ పాలసీకి రైడర్‌ను జోడించడంలో బిజీగా ఉన్నారా?. ప్రస్తుతం తీసుకుంటున్న పాలసీకి అదనంగా మరికొంత చెల్లించడం ద్వారా ఎక్కువ కవరేజ్ పొందవచ్చని ఇన్సూరెన్స్ ఏజెంట్ సూచించాడా?. ఇలాంటి సమయంలో మీకు వచ్చే అనుమానం రైడర్‌ను ఎందుకు జోడించాలి? ఇంతకీ రైడర్ అంటే ఏమిటి? అన్నవి. ఈ రైడర్ ను యాడ్-ఆన్(Add On) అని కూడా పిలుస్తారు. ఇది జీవిత బీమాకు అదనపు సేవలను జోడించేందుకు వినియోగించే పద్ధది. దీనిని కొనుగోలు చేయటం ద్వారా పాలసీదారుడు అదనపు కవరేజ్ ను పొందవచ్చు. ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్యాలు, వైకల్యాలు వంటివి ఈ రైడర్‌లో కవర్ చేయబడతాయి. అయితే పాలసీదారుడు ఇందులో గమనించాల్సింది ఏమిటంటే.. పాలసీకి అధనంగా రైడర్ తీసుకోవటం వల్ల చెల్లించాల్సిన ప్రీమియం మెుత్తం పెరుగుతుంది. కానీ.. ఇదే సమయంలో ఒక రైడర్ ను అధనంగా ఉన్న పాలసీలో పాటుగా తీసుకోవటం వల్ల ఖర్చు తగ్గుతుంది.
తీవ్రమైన అనారోగ్యం వంటి వాటి కోసం కవర్ తీసుకున్నప్పుడు.. ప్రీమియం ప్రతి సంవత్సరం సవరించబడుతుంది. ఇలాంటి పాలసీల్లో ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి వయస్సుతో పాటు చెల్లించాల్సిన ప్రీమియం మెుత్తం కూడా పెరుగుతుంది.అయితే.. రైడర్‌ను టర్మ్ ఇన్సూరెన్స్‌తో తీసుకుంటే, నిర్ణీత ప్రీమియంతో మొత్తం పాలసీ కాలానికి తీవ్రమైన అనారోగ్యాలకు కవరేజీని పొందుతారు. కాబట్టి.. ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు టర్మ్ కవర్‌తో తక్కువ ప్రీమియంలకు రైడర్‌లను అందజేసేంత ఉదారంగా ఉన్నాయా?.. అందుకే పాలసీకి అదనంగా రైడర్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటం కంటే రైడర్లను అదనంగా ఎంచుకోవటం ఎకనామికల్ గా ఉంటుంది. కానీ చవకైన రైడర్లు మీకు అనేక విధాలుగా ఖర్చు పెంచుతాయి. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడానికి జీవిత బీమా కోసం క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ తీసుకున్నట్లయితే.. క్యాన్సర్, గుండెపోటు, అవయవ సంబంధిత వ్యాధులు, పక్షవాతం మొదలైనవి ఇందులో కవర్ అవుతాయి. కానీ.. ఈ యాడ్-ఆన్ రైడర్ ను ఎంచుకునే సమయంలో సదరు ఇన్సూరెన్స్ కంపెనీ దానికింద కవర్ చేస్తున్న అనారోగ్యాల జాబితాను తప్పని సరిగా పాలసీదారుడు తెలుసుకోవాలి. వివిధ కంపెనీలు తీవ్రమైన అనారోగ్యాలకు వేర్వేరు కవర్‌లను కలిగి ఉండవచ్చు. కాబట్టి ఏది కింద ఏమేమి కవర్ అవుతాయో చూసుకోవటం ఉత్తమం. అయితే క్లిష్టమైన అనారోగ్యం ఏ దశలో కవర్ చేయబడుతుందో చూడటం మరింత ముఖ్యమైనది. చాలా పాలసీలు అనారోగ్యం ముదిరిన దశలో అంటే క్లిష్టమైన దశల్లో మాత్రమే కవర్ చేస్తుంటాయి.
పాలసీ కొనుగోలుదారు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే..
రైడర్ కు చెల్లించే మెుత్తం సాధారణంగా మీ ప్రాథమిక కవర్ మొత్తం ప్రీమియంలో 5-10 శాతం వరకు ఉంటుంది. మీరు మీ బీమాకు ఎన్ని రైడర్‌లను అయినా జోడించవచ్చు. కానీ రైడర్లన్నిటిపై కలిపి ప్రీమియం మీ ప్రాథమిక ప్రీమియంలో 30 శాతానికి మించకూడదు. మీరు ఒకటి కంటే ఎక్కువ రైడర్లను తీసుకున్నప్పుడు.. మీ ప్రీమియం మొత్తం కూడా పెరుగుతుంది. ఈ పెరుగుతున్న ప్రీమియం మీ జేబుపై భారంగా మారవచ్చని గుర్తుంచుకోండి. ఉదాహరణకు మీరు ఉద్యోగ అవసరాల రీత్యా రోడ్డు లేదా విమానంలో ప్రయాణించాల్సి చేస్తే.. అదనపు రక్షణ కోసం మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రైడర్‌ని తీసుకోవచ్చు. కానీ.. క్లిష్టమైన అనారోగ్య రైడర్‌కు సంబంధించినంతవరకు ప్రత్యేక కవర్ తీసుకోవడం ఉత్తమమైన నిర్ణయం.
ఇవీ చదవండి..
NSE IFSC: అమెరికా కంపెనీల షేర్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ లాంటి ఇన్వెస్టర్లకే..
UDAN Scheme: ఉడాన్ స్కీమ్ కింద హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు